Advertisement

ఆది సాయికుమార్ ‘బుర్ర‌క‌థ’ ఫ‌స్ట్ లుక్‌

Fri 12th Apr 2019 01:28 PM
aadhi sai kumar,burrakatha movie,first look,release  ఆది సాయికుమార్ ‘బుర్ర‌క‌థ’ ఫ‌స్ట్ లుక్‌
Aadhi Saikumar Burrakatha First look Released ఆది సాయికుమార్ ‘బుర్ర‌క‌థ’ ఫ‌స్ట్ లుక్‌
Advertisement

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్నచిత్రం ‘బుర్ర‌క‌థ’. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. డిఫ‌రెంట్ షేడ్స్‌తో స‌రికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆక‌ట్టుకుంటున్నాడు. ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఒక మ‌నిషికి రెండు మెద‌ళ్లు ఉంటే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంట‌ర్‌ టైనర్  ‘బుర్ర‌క‌థ’. క‌థానుగుణంగానే ఫ‌స్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుద‌ల చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. 

మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు. 

న‌టీన‌టులు:

ఆది సాయికుమార్‌

మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి

నైరా షా

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, 

ప‌థ్వీరాజ్‌

గాయ‌త్రి గుప్తా

అభిమ‌న్యుసింగ్, ఫిష్ వెంక‌ట్‌

ప్ర‌భాస్ శ్రీను

గీతా సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం :  డైమండ్ ర‌త్న‌బాబు

నిర్మాత‌:  హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌

నిర్మాణ సంస్థ‌:  దీపాల ఆర్ట్స్‌

మ్యూజిక్‌:  సాయికార్తీక్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సి.రాంప్ర‌సాద్‌

ఎడిట‌ర్‌:  ఎం.ఆర్‌.వ‌ర్మ‌

స్క్రీన్‌ప్లే: ఎస్‌.కిర‌ణ్‌, స‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్య‌భ‌వాన్ దిడ్ల 

ఆర్ట్‌:  చిన్నా

సాహిత్యం:  శివ శ‌క్తిద‌త్తా, భాస్క‌ర్ల భ‌ట్ల‌, కె.కె

ఫైట్స్‌:  వెంక‌ట్‌, స‌ల్మాన్ రాజ్‌, రియ‌ల్ స‌తీష్‌

పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖర్‌

Aadhi Saikumar Burrakatha First look Released:

Aadhi Saikumar New Movie Burrakatha

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement