Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bellamkonda Sai Srinivas Totally Changed

బెల్లంకొండ బాబులో ఈ మార్పు హిట్టిస్తోందా?

ఈమధ్య నాని-విక్రమ్‌ కె.కుమార్‌ల చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్‌’ అనే టైటిల్‌ పెడితే మెగాభిమానులు నానాహంగామా చేశారు. తమ హీరో టైటిల్‌ని రామ్‌చరణ్‌ మరీ కాకుంటే మరో మెగా కాంపౌండ్‌ హీరో పెట్టుకోవాలని, అంతేగానీ నాని పెట్టుకోవడం సరికాదని వాదన మొదలెట్టారు. చివరకు ఈ టైటిల్‌ మాదేనని మరో నిర్మాణ సంస్థ బయటకు వచ్చింది. మొత్తానికి ఈ వివాదం సమసి పోయింది అనుకునే లోపలే మరో మెగాస్టార్‌ టైటిల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1986లో చిరంజీవి, రాధ, సుహాసిని కాంబినేషన్‌లో యండమూరి నవల ‘రాక్షసుడు’ ఆధారంగా అదే టైటిల్‌తో ఓ చిత్రం వచ్చి అద్భుతమైన సక్సెస్‌ని సాధించింది. ప్రస్తుతం ఈటైటిల్‌ను బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ చిత్రానికి పెట్టాలని డిసైడ్‌ అయ్యారట. 

ఈ చిత్రం తమిళ ‘రాచ్చసన్‌’ ఆధారంగా రీమేక్‌ అవుతోంది. రమేష్‌వర్మ దర్శకత్వం వహిస్తుండగా, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్నాడు. నెగటివ్‌ టచ్‌లో విలన్‌ని సూచించే ఈ టైటిల్‌ పెట్టడం కంపల్సరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైటిల్‌ కథకి బాగా యాప్ట్‌ అయ్యే టైటిల్‌. చిరంజీవి ‘రాక్షసుడు’ చిత్రం తర్వాత సాయికుమార్‌ హీరోగా మరో ‘రాక్షసుడు’ చిత్రం వచ్చింది. అది ఎప్పుడు విడుదల అయిందో ఎప్పుడుపోయిందో కూడా తెలియదు. 

ఇక కొంతకాలం కిందట సూర్య నటించిన ఓ తమిళ హర్రర్‌ చిత్రానికి తెలుగులో ఇదే టైటిల్‌ని పెట్టారు. ఇది కూడా బాగా ఆడలేదు. మొత్తానికి ఈ టైటిల్‌ని సాయిశ్రీనివాస్‌ నాలుగోసారి వాడుకుంటున్నాడన్నమాట. తేజ దర్శకత్వంలో హీరోయిన్‌ కాజల్‌ పేరు మీద ‘సీత’ అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తోన్న బెల్లంకొండ బాబుకి ఈసారి విలన్‌ని సూచించే టైటిల్‌ని పెట్టడం విశేషం. ఈ విషయంలో హీరో తానే కాబట్టి తన పేరు మీదనే టైటిల్‌ ఉండాలని గట్టి పట్టు పట్టకుండా కాస్త సంయమనం చూపిస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ని మెచ్చుకోవాల్సిందే...! 

Bellamkonda Sai Srinivas Next Film Rakshasudu

Bellamkonda Sai Srinivas Totally Changed
bellamkonda sai srinivas
next film
rakshasudu