పెళ్లికాని కాజల్ అగర్వాల్, తమన్నాల కన్నా పెళ్లి తర్వాత కూడా ఓ రేంజ్ క్రేజ్ తో ఉంది సమంత. కాజల్, తమన్నాలు కుర్ర హీరోలతోనూ, మీడియం హీరోలతోనూ అడ్జెస్ట్ అవుతుంటే.. సమంత మాత్రం లేడి ఓరియెంటెడ్, అలాగే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతోను దూసుకుపోతుంది. కాజల్ బెల్లకొండ సరసన కవచం సినిమాలో గ్లామర్ భామగా నటించింది. ఇక తమన్నా అయితే ఎఫ్ 2 లో వెంకీ సరసన గ్లామర్ తో రెచ్చిపోయి నటించింది. కానీ కాజల్ కి, తమన్నాకి పెద్దగా పేరు వచ్చింది లేదు. కానీ సమంత పెళ్లి తర్వాత గత ఏడాది రంగస్థలం రామలక్ష్మిగా, మహానటి మధురవాణిగా, అభిమన్యుడులో డాక్టర్ లతగా, ఇక యుటర్న్ లో రచనగా డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలతో అదరగొట్టేసింది.
ఇక ఈ ఏడాది మజిలీ సినిమాలో శ్రావణిగా మధ్యతరగతి భార్య పాత్రలో నటించింది సమంత. ఈరోజు విడుదలకాబోతున్న ఈ సినిమాలో సమంత నటనకు 100 శాతం మార్కులు పడడం ఖాయంగా కనబడుతుంది. ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అంటూ మరో డిఫ్రెంట్ పాత్రలో నటించింది. ఆ సినిమా కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. ఇక తమిళ రీమేక్ 96 లో కూడా సమంత నటిస్తే సమంత రేంజ్ ని ఎవరు తట్టుకోలేరు. మరి పెళ్లికాని హీరోయిన్స్ కన్నా ఎక్కువగా పెళ్లి అయిన సమంత సినిమాల జోరు మాములుగా లేదు. ఈరోజు విడుదలవుతున్న మజిలీ హిట్ అయ్యిందా.. ఇక సమంత టాప్ రేంజ్ లో మరోసారి బిజీగా అదరగొట్టడం ఖాయం.





రెండో హీరోయిన్ని సమంతే తొక్కేసిందా?

Loading..