Advertisement

21వ కళాసుధ ఉగాది అవార్డుల వివరాలు

Fri 05th Apr 2019 12:19 PM
21st kala sudha,awards,curtain raiser event,press meet  21వ కళాసుధ ఉగాది అవార్డుల వివరాలు
21st Kala Sudha Awards Curtain Raiser Event 21వ కళాసుధ ఉగాది అవార్డుల వివరాలు
Advertisement

గత 20 సంవత్సరాలుగా చెన్నై నగరంలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సినిమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది ఉగాది సందర్బంగా 21 వ ఉగాది పురస్కారాలు పేరుతో అవార్డులు అందించనున్నారు. ఈ సందర్బంగా కర్టైన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్  ఫిలిం ఛాంబర్ లో గురువారం జరిగింది. ప్రముఖ సీనియర్ దర్శకులు సాగర్ ఉగాది పురస్కారాల బ్రోచర్ ని విడుదల చేసి నిర్మాత మోహన్ వడ్లపట్ల కు అందచేశారు. 

ఈ కార్యక్రమంలో కళాసుధ ప్రెసిడెంట్ బేతిరెడ్డి శ్రీనివాస్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దర్శకుడు సాగర్ మాట్లాడుతూ... గత 20 సంవత్సరాలుగా కళాసుధ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం. నిజంగా ఇలాంటి మంచి పని చేస్తున్న శ్రీనివాస్ ని ఈ కమిటీని అభినందిస్తున్నాను. అన్ని పనులు డబ్బుకోసం చేయరు. కొన్ని పనులు సంతృప్తి కోసం చేస్తారు, ఇది అలాంటిదే. ఈ ఏడాది అవార్డులు అందుకుంటున్న వారిని అభినందిస్తున్నాను. చెన్నైలో తెలుగు వాళ్ళ సత్తా చాటేలా ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తున్న వారిని అభినందిస్తున్నాను అన్నారు. 

నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. నేను కూడా పదేళ్ల క్రితం కలవరమాయే మదిలో సినిమాకు గాను ఈ అవార్డును అందుకున్నాను. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చెన్నైలో ఈ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ సారి సినిమా తారలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. 

బేతిరెడ్డి  శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ఇరవై ఏళ్లుగా కళాసుధ పేరుతో ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఉగాది సందర్బంగా సినిమా తరాలను అవార్డులతో సత్కరిస్తున్నాం. సినిమా వాళ్ళ ప్రోత్సహం కూడా ఎంతో ఉంది. ఎప్పటిలాగే ఈ ఏడాది చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరుగుతుంది. అందరు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో ఉగాది అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారాలు కూడా అందచేస్తారు. 

21st Kala Sudha Awards Curtain Raiser Event:

21st Kala Sudha Awards Press Meet

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement