‘సూపర్‌డీలక్స్’ క్రెడిట్ చైతూకే: సమంత

‘సూపర్‌డీలక్స్’ గురించి సమంత మాట్లాడుతూ.. ‘సూపర్‌డీలక్స్’ చిత్రంలో నెగటివ్ టచ్ ఉన్న వింబు అనే పాత్రలో నటించాను. ఆ పాత్రను చేయడం వల్ల ఎలాంటి విమర్శలు వస్తాయో అని భయపడ్డాను. కానీ ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ చిత్రం చేయడానికి కారణం చైతు.
ఈ పాత్ర గురించి ఆయనకు తెలిసిన వెంటనే ఆ పాత్రను చేయమని ప్రోత్సహించాడు. అందుకే ఈ చిత్రం క్రెడిట్ చైతుకే వెళ్తుంది. సినిమా రిజల్ట్ చూసుకున్న మావయ్య నాగార్జున ఫోన్ చేసి అభినందించారు. ఆయన తన కొడుకులిద్దరిని ఎలా ప్రోత్సహిస్తారో నన్ను కూడా అలాగే ప్రోత్సహిస్తారు. ఈ విజయం నాకు అపురూపం. ఇక నుంచి చాలెంజింగ్ పాత్రలే చేస్తాను. ‘మజిలీ’ కూడా ఇదే కోవకి చెందుతుంది.... అని చెప్పుకొచ్చింది.
Samantha about Super Deluxe movie Success
Super Deluxe Credit Goes to Chaitu says Samanthasamantha
super deluxe
success
naga chaitanya
nagarjuna








































