Advertisementt

పెళ్లి తరువాత కూడా సామ్ క్రేజ్ తగ్గలే!

Tue 02nd Apr 2019 07:37 PM
samantha,craze,majili,theatrical rights,sold out  పెళ్లి తరువాత కూడా సామ్ క్రేజ్ తగ్గలే!
This is the Samantha Craze పెళ్లి తరువాత కూడా సామ్ క్రేజ్ తగ్గలే!
Advertisement
Ads by CJ

పెళ్ళైతే ఏంటి క్రేజ్ తగ్గకుండా ఉంటే చాలు.. అన్నట్టుగా ఉంది సమంత వ్యవహారం. బాలీవుడ్లో అయినా, టాలీవుడ్ లో అయినా, కోలీవుడ్ లో అయినా పెళ్లయిన హీరోయిన్ కి అవకాశాలు చాలా రేర్ గా వస్తాయి. వచ్చినా ఏ సీనియర్ హీరోయిన్ లిస్ట్ లోనో ఆ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే పెళ్లి వయసు దాటి పదేళ్లకు గాని వారు పెళ్లి చేసుకోరు. కానీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ చైర్ లో ఉన్న హీరోయిన్ సమంత పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసేసుకుంది. అయినా పెళ్లి తర్వాత కెరీర్ లో ఏ హీరోయిన్ కి లేని క్రేజ్ సమంతకి ఉంది. అందుకే ఇప్పటికి సమంత డైరీ ఫుల్ గానే నడుస్తుంది. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ని ఏలేస్తుంది.

తెలుగులో మజిలీ, మిస్టర్ గ్రానీ, అలాగే 96 రీమేక్.. కొత్తగా ప్రభాస్ తో సమంత జోడి అనే న్యూస్ లతో పాటుగా తమిళనాట సూపర్ డీలక్స్ తో సూపర్ హిట్ కొట్టిన సమంత మరో రెండేళ్లు సినిమాలతో ఫుల్. ఇక సమంత తెలుగు చిత్రం మజిలీ రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భర్త చైతూతో కలిసి నటించిన ఈ సినిమా మీద కేవలం సమంత కారణంగానే భారీ క్రేజ్ ఉంది. చైతు గత కొన్నాళ్లుగా హిట్ కి మొహం వాచి ఉండడం.. చైతు మార్కెట్ డల్ గా ఉన్నా సమంత క్రేజ్ కారణంగా మజిలీ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా శాటిలైట్ హక్కులు ఓ రేంజ్ లో అమ్ముడుపోయాయి. మజిలీ సినిమాకి థియేట్రికల్ హక్కుల కింద తెలుగు రాష్ట్రాల నుంచి 15 కోట్లు, ఓవ‌ర్సీస్‌, ఇత‌ర ప్రాంతాల నుంచి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయ‌లు రావడం చూస్తుంటే ఇదంతా సమంత క్రేజ్ చలవే అంటున్నారు.

This is the Samantha Craze:

Majili Theatrical Rights Sold Out

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ