Advertisementt

స‌మంత సినిమాపై మండిప‌డిన కెమెరామెన్‌!

Tue 02nd Apr 2019 03:49 PM
natarajan subramanian,super deluxe,samantha,vijay sethupathi,ramyakrishna,  స‌మంత సినిమాపై మండిప‌డిన కెమెరామెన్‌!
natarajan subramanian sensational comments స‌మంత సినిమాపై మండిప‌డిన కెమెరామెన్‌!
Advertisement
Ads by CJ

న‌టుడు, టాలెంటెడ్ కెమెరామెన్ న‌ట‌రాజ సుబ్ర‌హ్మ‌ణ్యం స‌మంత న‌టించిన సినిమాపై మండిప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.  బాలీవుడ్‌లో బ్లాక్ ఫ్రైడే, హ‌ల్లాబోల్‌, ప‌రిణీత‌, జ‌బ్ వీ మెట్‌, ల‌వ్ ఆజ్ క‌ల్‌, గోల్‌మాల్ రిట‌ర్న్స్‌, రాంఝానా, హాలీడే, త‌మిళంలో తుపాకి, పులి, తెలుగులో అఆ, ఛ‌ల్ మోహ‌న్‌రంగ వంటి చిత్రాల‌కు కెమెరామెన్ గా, స‌తురంగ వెట్టై, క‌త‌మ్ క‌త‌మ్‌, బొంగు. రిచి వంటి చిత్రాల్లో న‌టుడిగా ఆక‌ట్టుకున్న న‌ట‌రాజ సుబ్ర‌హ్మ‌ణ్యం స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన `సూప‌ర్ డీల‌క్స్‌` చిత్రంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

``సూప‌ర్ డీల‌క్స్‌` సినిమానా ...చూస్తూ భ‌రించ‌లేక‌పోయా` అంటూ న‌ట‌రాజ సుబ్ర‌హ్మ‌ణ్యం ట్విట్ట‌ర్ వేదిక‌గా `సూప‌ర్ డీల‌క్స్‌` చిత్ర బృందంపై విరుచుకుప‌డ్డారు. `నిజ‌జీవితంలో ఇలాంటి అనూహ్య‌మైన అంశాల‌ను ప్రోత్స‌హించ‌డం, అభినందించ‌డం క‌రెక్టేనా?. ఇలాంటి త‌క్కువ స్థాయి అంశాల‌కు నేను దూరంగా వుంటాను. `సూప‌ర్ డీల‌క్స్‌` ఇది సినిమానా? ..ఓ గాడ్  అస‌లు భ‌రించ‌లేక‌పోయా` అని ట్వీట్ చేశాడు. ఇది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.   అయితే `సూప‌ర్ డీల‌క్స్‌` న‌చ్చిన  నెటిజ‌న్స్  మాత్రం న‌ట‌రాజ సుబ్ర‌హ్మ‌ణ్యంని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. నీకు సినిమా న‌చ్చ‌క‌పోతే ఇంత నీచంగా కామెంట్ చేస్తావా? అంటూ అంటూ మండిప‌డుతున్నారు. 

natarajan subramanian sensational comments:

natarajan subramanian comments on super deluxe

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ