‘వ్యూహం’లో సమంత- ఎవరి జోడీనో తెలుసా?

Samantha in Vyooham MovieSamantha in Vyooham Movie

‘జెంటిల్‌మెన్, సమ్మోహనం’ సినిమాల తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక మల్టీస్టారర్ మూవీని దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కించడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో కాగా.. హీరో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నాడు. అయితే నాని నెగెటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి టైటిల్ గా ‘వ్యూహం’ అనే టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయించినట్లుగా గత రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని.. అతనికి జోడిగా అదితి రావు నటించే అవకాశమున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 

ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న నానికి కూడా ఈ సినిమాలో హీరోయిన్ ఉండబోతుందని.. ఆ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత అని అంటున్నారు. సమంత, నాని కలిసి ‘ఈగ’ సినిమాలో నటించారు ఆ సినిమా సూపర్ హిట్. ఇక నాని సమంత కలిసి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’లోనూ నటించాడు ఆ సినిమా కూడా హిట్టే. మరి ఇప్పుడు నిజంగానే ఈ సినిమాలో ఈ ఇద్దరు జోడికడితే ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టినట్లే. అయితే ఈ మధ్యన గ్లామర్ పాత్రలను తగ్గించి.. నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్ చేస్తున్న సమంతని ఒకవేళ ఇంద్రగంటి కలిసి కథ చెప్పి ఒప్పిస్తే.. సమంత ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Samantha and Nani Jodi in Vyooham

samantha
nani
jodi
vyooham movie