ఆ ఈవెంట్‌లో జనసేన గురించి తారక్ మాట్లాడతాడా?

Fri 29th Mar 2019 05:50 PM
jr ntr,chief guest,sai dharam tej,chitralahari event  ఆ ఈవెంట్‌లో జనసేన గురించి తారక్ మాట్లాడతాడా?
Jr NTR Chief Guest to Chitralahari Event ఆ ఈవెంట్‌లో జనసేన గురించి తారక్ మాట్లాడతాడా?
Sponsored links

ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి వరుసగా యంగ్‌హీరోలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఏప్రిల్‌ 5న నాగచైతన్య ‘మజిలీ’, 12న సాయిధరమ్‌తేజ్‌ ‘చిత్రలహరి’, 19న నాని ‘జెర్సీ’, 25న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఇలా పలువురు లైన్‌లో ఉన్నారు. ఇక ఈ చిత్రాల సంగతేమో గానీ వీటి ప్రీరిలీజ్‌ వేడుకలకు సంబంధించిన వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఏప్రిల్‌ 5న నాగచైతన్య-సమంతల ‘మజిలీ’ ప్రీరిలీజ్‌ వేడుక గ్రాండ్‌గా జరుపనున్నారు. పెళ్లయిన తర్వాత చైతుతో సమంత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. 

ఇక ఈ వేడుకకు నాగచైతన్య తండ్రి, సమంత మామయ్య నాగార్జున, నాగచైతన్యకి మేనమామ విక్టరీ వెంకటేష్‌లు ముఖ్య అతిథులుగా రానున్నారని తెలుస్తోంది. గతంలో నాగచైతన్య మొదటి చిత్రం ‘జోష్‌’ వేడుకకు నాగ్‌, వెంకీలు కలిసి వచ్చారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించగా, ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. మరి వారిద్దరు మరోసారి ‘మజిలీ’ వేడుకకు వస్తున్నారు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది...! ఇదే సమయంలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ నటించిన ‘చిత్రలహరి’ వేడుకకు ముఖ్య అతిథి ఎన్టీఆర్‌ అనే ప్రచారం సాగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌తో కలసి నటిస్తున్న చరణ్‌ అభ్యర్ధన మేరకే ఎన్టీఆర్‌ వస్తాడనే వార్తలు వినిపిసున్నాయి. 

ఇక మెగా కాంపౌండ్‌ హీరోల వేడుక అంటే వాటికి పవన్‌కళ్యాణ్‌ హాజరైనా కాకపోయినా పవన్‌ అభిమానులు గోలగోల చేస్తారు. తమ హీరో గురించి చెప్పమని, మాట్లాడమని, ఆయన పార్టీ జనసేన గురించి అతిధులు అందరూ మాట్లాడేవరకు వారు ఊరుకోరు. గతంలో ఇదే విషయంలో ‘చెప్పను బ్రదర్‌’ అంటూ బన్నీ బుక్‌ అయ్యాడు. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. టిడిపికి కూడా మద్దతు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ‘చిత్రలహరి’ ప్రీరిలీజ్‌ వేడుకకు విచ్చేస్తే మాత్రం పవన్‌ గురించి మాట్లాడకుండా ఉండేందుకు అభిమానులు ఒప్పుకోరు. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే చిత్రలహరికి ఎన్టీఆర్‌ హాజరు అవుతాడా? లేదా? అనే అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి. 

Sponsored links

Jr NTR Chief Guest to Chitralahari Event:

Mega Fans Waiting for NTR Feeling on Janasena

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019