కంగనా 24 కోట్లు డిమాండ్ చేసిందట!

Mon 25th Mar 2019 11:28 PM
kangana ranaut,jayalalitha,manikarnika,biopic,remuneration,kangana  కంగనా 24 కోట్లు డిమాండ్ చేసిందట!
Kangana Ranaut Demands 24 Crores for That Role కంగనా 24 కోట్లు డిమాండ్ చేసిందట!
Sponsored links

తెలుగులో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఘోరాతి ఘోరంగా ప్లాప్ అయింది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ హడావిడి చేసిన క్రిష్, బాలయ్యలు ప్రస్తుతం మీడియాకి కనబడడం లేదు. ఇక తమిళనాట మాజీ హీరోయిన్, తమిళనాడు పాలిటిక్స్‌లో చక్రం తిప్పి సీఎంగా పనిచేసిన జయలలిత కూడా కొందరి వ్యక్తుల చేత మోసగింపబడి.. .. చివరి దశలో హాస్పిటల్‌లో ప్రాణాపాయంలో చేరి.. అక్కడే అసువులు బాసింది. అయితే ఆమె మరణానంతరం చాలామంది అమ్మ బయోపిక్ ని తెరకెక్కిస్తామంటూ బయలుదేరారు. అయితే అమ్మ మీద ఎవరి వెర్షన్ బయోపిక్స్ వారు ట్రై చేస్తున్నారు. తాజాగా జయలలిత బయోపిక్ విష్ణు ఇందూరి తెరకెక్కించబోతున్నాడు. ఎప్పుడో ప్లాన్ చేసినా.. ఇప్పుడు అమ్మ బయోపిక్ పట్టాలెక్కబోతుంది.

ఇక తమిళ, హిందీ భాషల్లో విష్ణు ఇందూరి, కె ఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. అమ్మ బయోపిక్ కి తలైవి అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఇక ఈ తలైవి లో అమ్మ జయలలితగా బాలీవుడ్ మణికర్ణిక కంగనా రనౌత్ నటిస్తుందట. అమ్మగా కంగనా దాదాపు ఫైనల్ అయినట్లే. అయితే అమ్మగా నటించబోయే కంగనా తలైవి కోసం తీసుకునే పారితోషకం ఇప్పుడు తెగ హైలెట్ అవుతుంది. క్వీన్ గా.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని.. మణికర్ణిక సినిమాతో డైరెక్టర్ గా అవతారమెత్తిన కంగనా తలైవి కోసం ఏకంగా 24 కోట్ల పారితోషికాన్ని విష్ణు ఇందూరిని డిమాండ్ చేసిందట. మరి కంగనా క్రేజ్ కారణంగా తలైవి నిర్మాత ఆమెకు 24 కోట్లు ఇచ్చేందుకు సిద్దమయ్యాడనే న్యూస్ మాత్రం బాలీవుడ్, కోలీవుడ్‌లలో హాట్ టాపిక్‌గా మారింది. 

ఇక జయలలిత జీవితం మీద చాలామందికి చాలా ఆసక్తి ఉంది. జయలలిత ప్రేమ, పెళ్లి, బిడ్డ, అలాగే ఎంజీఆర్‌తో జయలలిత సంబంధం.. అలాగే శశికళ వలన జయలలిత స్నేహం వంటివన్నీ ఆమె బయోపిక్‌లో చూపిస్తారో.. లేదంటే ఎన్టీఆర్ బయోపిక్‌లా ఒక వెర్షన్ చూపిస్తారో అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏప్రిల్ నుండి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం.

Sponsored links

Kangana Ranaut Demands 24 Crores for That Role:

Kangana Ranaut in Jayalalitha Biopic 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019