Advertisementt

‘మా’ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారం

Sat 23rd Mar 2019 08:40 PM
movie artists association,maa,new president,naresh,pramana sweekaram  ‘మా’ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారం
MAA President Naresh Pramana Sweekaram ‘మా’ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారం
Advertisement
Ads by CJ

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్‌ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు..  ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణం రాజు దంపతులు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరయ్యారు. వీరితో పాటు ‘మా’ మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం గమనార్హం. మా ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు.  ఈ సందర్భంగా ‘మా’ కోసం కంపోజ్ చేయించిన ప్రత్యేక గీతాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆయన సతీమణి నిర్మల  చేతులమీదుగా విడుదల చేశారు. 

ఈ సందర్భంగా  ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందరు కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేసి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ఆదుకోవడమే. అందుకోసం మా ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. మా సంస్థకు ఏ అవసరం వచ్చినా నేను ఉంది సహాయం చేయడానికి రెడీ. మా అంటేనే అమ్మ. ఈ కళకి కులం మతం అంటూ బేధం లేదు.  అందరు కలిసి కట్టుగా ఈ సంస్థ యొక్క అభివృద్ధికి కృషి చేయాలనీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విజయనిర్మల గారు రావడం చాలా గొప్ప విషయం.  అన్నారు. 

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు చాలా సినిమా పాటలు చేశాను కానీ ఈ తరహాలో పాట చేయడం కొత్తగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన జీవిత గారికి, రాజశేఖర్ గారికి చాల థాంక్స్. బాలు గారితో పనిచేయాలనేది నా డ్రీమ్. ఆ డ్రీమ్ ఈ పాటతో తీరింది. నరేష్ గారు రెండు రోజుల్లో పాట కావాలి అన్నప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు పాటకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నారు. 

నటుడు మాజీ ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘మా’ కమిటీ భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నాకంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన వారు చెప్పిందేంటంటే.. మేం ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఫండ్స్‌ తీసుకొచ్చిపెట్టాం. దాంట్లోంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం. మీరు కష్టపడి బయటనుంచి ఫండ్లు కలెక్ట్‌ చేసి తీసుకురావాలి అని చెప్పారు. తూచా తప్పకుండా వారి మాటను నేను పాటించాను. అదే విధంగా ఇప్పుడు పనిచేయబోయే కమిటీ కూడా అంతే కష్టపడాలని ఆశిస్తున్నాను. నా నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమే అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా నరేష్ గారి ప్యానెల్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని అంశాలు వారికున్న రెండు సంవత్సరాల కాలంలో చేసి అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాను అన్నారు. 

విజయనిర్మల మాట్లాడుతూ.. మీ అందరిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లోనే మా పుట్టింది. నేను మా అభివృధ్ధి కోసం ఇదివరకు ఇస్తున్న డబ్బుకంటే ఎక్కువే ఇచ్చి మా ఋణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా చెప్తున్నాను. అన్నారు.

రెబల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. ‘మా’ నాది, మనది అని గుండెల మీద చేతులు వేసుకుని పనిచేయాలి. చెన్నైలో ఉన్నప్పుడు కృష్ణగారు, మేము అంతా చాలా బాగా మా అసోసియేషన్ ని నడిపాం. అప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి.  మా అభివృధ్ధి కోసం ప్యానెల్ లోని అందరు కలిసి కట్టుగా పనిచేసి మా అసోసియేషన్ ప్రతిష్టని ఎంతో ఎత్తుకు చేర్చాలని కోరుకుంటున్నాను అన్నారు. 

‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ , విజయనిర్మల గారికి, రెబల్ స్టార్ కృష్ణం రాజు , శ్యామల గారికి, కోట శ్రీనివాసరావు గారికి, సహజనటి జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. 25 సంవత్సరాలుగా మా అభివృధ్ధి కోసం ఎంతో మంది అధ్యక్షులు కృషి చేశారు.  వారందరికీ ధన్యవాదాలు. మా ప్రతిష్టని మరింత పెంచేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. మా అసోసియేషన్ లో ఉన్న ప్రతిఒక్కరు ఎంతో సంతోషంగా ఉండాలి. ఇది జరగాలంటే ప్రతిఒక్కరు క్రమశిక్షణతో, విధేయతతో గౌరవంతో పనిచేయాలి. ‘మా’ గీతం నేను ‘మా’ అమ్మకి ఇచ్చే మొదటి బహుమతి. రెండో బహుమతిగా నా నుంచి ఒక లక్ష వెయ్యి నూట పదహార్లు నా సోదరుల సంక్షేమం కోసం ఇస్తున్నాను.  మా అమ్మ విజయనిర్మల గారు ప్రతినెలా 15000 ఇస్తున్నారు. మా అసోసియేషన్ మా ఇంట్లో మొదలైంది. అలాంటి ‘మా’ అమ్మని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత నాది. మా అసోసియేషన్ సభ్యత్వం ఇంతకు ముందు ఉన్న దానికంటే 10,000 వేలు తగ్గిస్తూ 90,000 చేస్తున్నాం. ఇది నా మూడో గిఫ్ట్. 24 హావర్స్ హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసాం. సజెషన్ బాక్స్ ను ఏర్పాటు చేసి అందరి విన్నపాలు స్వీకరిస్తాం. మహిళల సాధికారత కోసం, వారి సంక్షేమం కోసం జీవిత గారి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే శివబాలాజీ ఇన్ ఛార్జ్ గా యూత్ ని లీడ్ చేసే ఓ కార్యక్రమం చేస్తున్నాం. జాబ్ కమిటీని గౌతమ్ రాజు గారు లీడ్ చేస్తూ అందరికి ఉపాధి లభించేలా చేస్తున్నాం. పెన్షన్ ని వెయ్యి రూపాయలు పెంచుతున్నాం. ప్రతినెలా మెడికల్ క్యాంపును ఏర్పాటుచేస్తున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు. మేము వెళ్లిన వెంటనే స్పందించి ఏ సహాయం కావాలన్నా చెప్పండి అని అన్నివిధాలుగా సహకరించిన వారికి, తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నారు.

MAA President Naresh Pramana Sweekaram:

Movie Artists Association (MAA) Naresh Panel Pramana Sweekaram

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ