Advertisementt

రౌడీ బ్రాండ్ నేమ్ ట్రాక్ త‌ప్పుతోంది!

Thu 21st Mar 2019 01:19 PM
vijay deverakonda,rowdy,rowdy brand image,owdy brand name  రౌడీ బ్రాండ్ నేమ్ ట్రాక్ త‌ప్పుతోంది!
vijay devarakonda rowdy plan reverse రౌడీ బ్రాండ్ నేమ్ ట్రాక్ త‌ప్పుతోంది!
Advertisement
Ads by CJ

మూస ధోర‌ణిలో వెళుతున్న తెలుగు సినిమా గ‌తిని మార్చిన సినిమా `అర్జున్‌రెడ్డి`. పాత్ బ్రేకింగ్ సినిమాగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండని రాత్రికి రాత్రి స్టార్ హీరోని చేసింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌ని కాపాడుకుంటూ వ‌రుస సినిమాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `గీత గోవిందం`తో వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ రౌడీ త‌న‌కున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవ‌డం కోసం రౌడీ అనే పేరుతో కొత్త బ్రాండ్ ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఇది యూత్‌లో య‌మ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే ఇది ట్రాక్ త‌ప్పుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

రౌడీ బ్రాండ్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇదే బ్రాండ్ నేమ్ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. త‌ను ప‌రిచ‌యం చేసిన రౌడీ బ్రాండ్‌ని వేలం వెర్రిగా ఫాలో అవుతున్న విజ‌య్ ఫ్యాన్స్ దాన్ని బ‌ట్ట‌ల ద‌గ్గ‌రే ఆపేయ‌కుండా బైక్స్ నెంబ‌ర్ ప్లేట్ల మీద‌కి తీసుకొచ్చారు. ఇక్క‌డే అస‌లు చిక్కు మొద‌లైంది. ఫ్యాన్స్ ఏకంగా త‌మ వాహ‌నాల నెంబ‌ర్ ప్లేట్ల‌పై రౌడీ అని రాయించుకోవ‌డం మొద‌లుపెట్టారు. దీనిపై న‌గ‌ర ట్రాఫిక్ పోలీసులు కొర‌డా ఝులిపించ‌డం మొద‌లుపెట్టారు. నెంబ‌ర్ ప్లేట్‌పై రౌడీ సింబ‌ల్ వున్న ఓ టూవీల‌ర్‌ని ప‌ట్టుకుని జ‌రిమానా విధించ‌డంతో రౌడీ బ్రాండ్ ట్రాక్ త‌ప్పుతోంద‌నే ప్ర‌చారం మొద‌లైంది.

దీంతో రౌడీ హీరో విజ‌య్ దిద్దుబాట మొద‌లుపెట్టాడు. త‌న అభిమానుల‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నెంబ‌ర్ ప్లేట్ల‌పై రౌడీ అని ముద్రించుకోవ‌డం త‌న వ‌ల్లే న‌ని అందుకు వారి త‌రుపున తాను క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్టు విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `మీరంతా నాపై చూపిస్తున్న అభిమానానికి ధ‌న్య‌వాదాలు. మిమ్మ‌ల్ని నా కుటుంబ స‌భ్యులుగా భావిస్తున్నాను. నా వ‌ల్ల ఏ ఓక్క అభిమాని ఇబ్బందులు ప‌డొద్దు. కొన్ని రూల్స్ మ‌నం త‌ప్ప‌కుండా పాటించాలి. మీ ప్రేమ‌ను ఎలాగైనా చూస‌పించండి` అని పోస్ట్ విజ‌య్ దేవ‌ర‌కొండ పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అభిమానం హ‌ద్దుల్లో వుంటేనే చూడ‌టానికి అందంగా వుంటుంది. హ‌ద్దులు దాటితే అన‌ర్థ‌మే.

vijay devarakonda rowdy plan reverse:

vijay devarakonda rowdy name in trouble

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ