సమ్మర్ బరిలో ఉన్న సినిమాలివే!

Mon 18th Mar 2019 04:28 PM
mahesh babu,summer,movie releases,maharshi,majili,chitralahari,jersey,sita  సమ్మర్ బరిలో ఉన్న సినిమాలివే!
Summer Release Movies List సమ్మర్ బరిలో ఉన్న సినిమాలివే!
Sponsored links

ఈ సమ్మర్ సినీ మేకర్స్ కి రాజకీయ నాయకులకి చాలా కీలకంగా మారనుంది. మన ఇండియాలో సమ్మర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు మరి ఏ సీజన్ లో రిలీజ్ అవ్వవు. ముఖ్యంగా మన టాలీవుడ్ లో ఈ సమ్మర్ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెద్ద సీజన్ కాబట్టి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని వరసబెట్టి రిలీజ్ అవుతున్నాయి.

ఏప్రిల్ నెలలో ఓవైపు ఎలక్షన్లు, మరోపక్క ఐపిఎల్ సీజన్ ఉన్నా కూడా మరోవైపు మన దర్శక నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 22 న వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు అంత సిద్ధంగా ఉంది. ఇక ఏప్రిల్ స్టార్టింగ్ లో నాగ చైతన్య - సమంత నటించిన మజిలీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏప్రిల్ 12న సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి విడుదల కానుంది. 

ఏప్రిల్ 19 న నాని నటించిన జెర్సీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈసినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 25న తేజ బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సీత సినిమా విడుదల కానుంది. ఇందులో కాజల్ హీరోయిన్. అలా ఏప్రిల్ మొత్తం సినిమాల హడావుడితో పాటు ఎలక్షన్స్ హీట్ కూడా ఉండబోతుంది. ఇక మే 9న మహర్షి సినిమా విడుదల కావడంతో ఈ భారీ సినిమా సీజన్ కు తెర పడనుంది. అలా పొలిటీషియన్స్, దర్శక నిర్మాతలు కూడా టెన్షన్ పెడుతుంది ఈ సమ్మర్.

Sponsored links

Summer Release Movies List:

Mahesh Babu Maharshi in summer Movies List

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019