అల్లూరిగా మహేష్ అంటే రెస్పాన్స్ రాలేదు: జక్కన్న

Fri 15th Mar 2019 10:04 PM
rajamouli,mahesh babu,seetha rama raju,jamesbond,roles,press meet  అల్లూరిగా మహేష్ అంటే రెస్పాన్స్ రాలేదు: జక్కన్న
Rajamouli Clarity on Mahesh in Alluri Seetha Rama Raju Role అల్లూరిగా మహేష్ అంటే రెస్పాన్స్ రాలేదు: జక్కన్న
Sponsored links

రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడో క్లారిటీ లేదు. మరి రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడనుకున్నవారికి మాములుగా షాకివ్వలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరి మహేష్ ని పక్కనబెట్టేసి రాజమౌళి ఈ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మొదలుపెట్టాడు. తాజాగా RRR రెండు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసేసి ఒక ప్రెస్ మీట్ ని గ్రాండ్ గా పెట్టేసాడు. ఆ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా... ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ లో RRR లో కనిపించబోతున్నట్లుగా చెప్పాడు.

అయితే ఒక మీడియా మిత్రుడు మహేష్ తో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేయిస్తే బావుండేది... ఎలాగూ మహేష్ తండ్రి కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా చేసి సక్సెస్ సాధించారు... అందుకే ఈ సినిమాలో ఆ పాత్రకి మహేష్ ని పెట్టి ఉంటే... కృష్ణ గారి అభిమానులు ఆనందపడేవారు కదా అని రాజవుళిని అడిగితే.. రాజమౌళి ఏమన్నాడో తెలుసా.. ఒకసారి ఏదో ఈవెంట్ లో మహేష్ ఫ్యాన్స్ ని కలిసినప్పుడు రాజమౌళి వాళ్ళని అడిగాడట. మహేష్ ని అల్లూరి సీతారామరాజు పాత్రలో చూడాలనుకుంటున్నారా.. లేదంటే జేమ్స్ బాండ్ తరహా పాత్రలోనా అని అడగగా.. వారు అల్లూరి కంటే.. ఎక్కువగా జేమ్స బాండ్ తరహా పాత్రకి ఇచ్చిన రెస్సాన్స్ తోనే మహేష్ ని ఈ RRR  లో తీసుకోలేదని చెప్పాడు.

మరి మాములుగా జక్కన్న మనసులో అల్లూరి పాత్రని మహేష్ తోనే చేయించాలని అనుకున్నట్టుగా అనిపించలేదు.. ఆ సమాధానం వింటే. అందుకే ఫ్యాన్స్ దగ్గర ఒక ట్రయిల్ వేసాడు. కానీ వారి రెస్పాన్స్ సరిగా లేకపోవడంతో... ఆ RRR మల్టీస్టారర్ కి మహేష్ ని తీసుకోకుండా ఎన్టీఆర్ ని, రామ్ చరణ్ జతచేసాడన్నమాట.

Sponsored links

Rajamouli Clarity on Mahesh in Alluri Seetha Rama Raju Role:

Mahesh Not Alluri.. He is Jamesbond says Rajamouli

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019