మహేష్‌కి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నారు!

Sun 10th Mar 2019 10:40 AM
mahesh babu,maharshi,postpones,april release movies,sita  మహేష్‌కి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నారు!
April Release Movies says Thanks to Mahesh Babu మహేష్‌కి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నారు!
Sponsored links

మొదట మహేష్‌బాబు ‘మహర్షి’ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేయాలని భావించారు. అది కాస్తా ఏప్రిల్‌ 25కి షిఫ్ట్‌ కావడంతో ‘మజిలీ, జెర్సీ, చిత్రలహరి’ వంటి చిత్రాలకు సోలో రిలీజ్‌లకు అది ఉపయోగపడింది. పోనీ మహేష్‌ ఏప్రిల్‌ 25న వస్తాడా? అనుకుంటే అది కూడా లేదు. ఆయన చిత్రం మే9కి షిఫ్ట్‌ అయింది. దాంతో మహేష్‌ వదిలేసిన ఏప్రల్‌ 25కోసం పోటీ పెరిగింది. 

తాజాగా ఈ పోటీలోకి తేజ ‘సీత’ ఎంటర్‌ కావడం విశేషం. ఇతరులు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయకముందే ‘సీత’ చిత్రం ఏప్రిల్‌ 25న విడుదల అంటూ ప్రమోషన్‌ స్టార్ట్‌ చేశారు. ‘సీత’ అనే మహిళా పాత్రధారి టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని మహిళా దినోత్సవం కానుకగా ప్రకటించారు. 

ఇక ‘సీత’ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, కాజల్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లోనే ‘కవచం’ చిత్రం వచ్చింది. కానీ అది డిజాస్టర్‌ అయింది. ఈ నేపధ్యంలో ‘సీత’ చిత్రం మీద దర్శకుడు తేజ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లు బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌, వెంకటేష్‌తో చిత్రాల నుంచి బయటకు వచ్చిన తేజ ఈ చిత్రాన్ని ఎలాగైనా పెద్ద హిట్‌ చేయాలనే కసితో ఉన్నాడు. నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్‌ చిత్రం తర్వాత తేజ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం యాక్షన్‌ నేపధ్యంలో సాగే ప్రేమకథా చిత్రం అని తెలుస్తోంది. 

ఇందులో తేజ మార్క్‌ లవ్‌ సీన్స్‌తో పాటు మాస్‌ ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కళంగా ఉన్నాయిట. ఇక ఈ చిత్రం టైటిల్‌ ‘సీత’ అనేది హీరో క్యారెక్టర్‌ పేరా? లేక హీరోయిన్‌ కాజల్‌ పాత్ర పేరా? అనేది తేలాల్సివుంది. మొత్తానికి ‘సీత’ అనే టైటిల్‌ మాత్రం క్యాచీగా ఉందనే చెప్పాలి. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. 

Sponsored links

April Release Movies says Thanks to Mahesh Babu:

Mahesh Babu Movie Maharshi Postponed to May

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019