ప్ర‌భాస్ ఈసారి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మేనా?

Sat 09th Mar 2019 02:58 PM
prabhas,shyamala devi,krishnam raju,prabhas marriage plans,prabhas saaho,  ప్ర‌భాస్ ఈసారి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మేనా?
krishnam raju wife shyamala reveals about prabhas marriage ప్ర‌భాస్ ఈసారి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మేనా?
Sponsored links

టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రైనా వున్నారంటే ముందు వ‌రుస‌లో వినిపించే పేరు ప్ర‌భాస్‌. గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ పెళ్లికి సంబంధించిన వార్త‌లు వినిపిస్తూనే వున్నాయి. ఎన్ని సార్లు అడిగినా ప్ర‌భాస్ వ‌చ్చే ఏడాది అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పెళ్లిని వాయిదా వేస్తూ వ‌స్తూనే వున్నాడు. అయితే ప్ర‌భాస్ ఈసారి పెళ్లి నుంచి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మేనా? అంటే అత‌ని పెద్ద‌మ్మ‌, కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి అవున‌ని పిచ్చక్లారిటీ ఇచ్చేసింది. ఇటీవ‌ల ఓ సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన శ్యామ‌లాదేవి ప్ర‌భాస్ వివాహంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 

గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం. త్వ‌ర‌గా చేసేయాల‌ని తొంద‌ర‌ప‌డుతున్నాం. అయితే ప్ర‌భాస్ పెళ్లికి సంబంధించి బ‌య‌ట ఎన్నో పుకార్లు వ‌స్తున్నాయి. వాట‌న్నింటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆ వార్త‌లు విన్న‌ప్పుడు, చూసిన‌ప్పుడు స‌ర‌దాగా న‌వ్వుకుంటాం. ఈ మ‌ధ్యే ప్ర‌భాస్‌ని పెళ్లి గురించి అడిగాం. ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. అవి పూర్తయిన త‌రువాత అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు. త్వ‌ర‌లోనే త‌ను చేస్తున్న రెండు చిత్రాలు పూర్తికాబోతున్నాయి. ఆ త‌రువాత ప్ర‌భాస్ పెళ్లి క‌బురు చెబుతాం` అని శ్యామ‌లా దేవి చెప్పుకొచ్చారు. 

కానీ ప్ర‌భాస్ ఆలోచ‌న‌లు మాత్రం పెళ్లి వైపు మ‌ళ్ల‌డం లేదు. ఇంత‌కీ ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడా?..చేసుకుంటే ఈ బాహుబ‌లిని పెళ్లి చేసుకోబోయే దేవ‌సేన ఎక్క‌డుంది?.. ఏ వైపు నుంచి వ‌స్తుంది? ద‌క్షిణాది అమ్మాయేనా? లేక ఉత్త‌రాది సుంద‌రా?...ఇలాంటి ఆలోచ‌న‌ల‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ బుర్ర‌బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నార‌ట‌. మ‌రి త‌న పెళ్లిపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌కు ఈ ఏడాదైనా ప్ర‌భాస్ శుభం కార్డు వేస్తాడా? లేదా అన్న‌ది తెలియాలంటే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్నరెండు సినిమాలు పూర్తి కావాల్సిందే. 

Sponsored links

krishnam raju wife shyamala reveals about prabhas marriage:

prabhas marriage plans is going on?

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019