టీజర్ మెగాస్టార్ కి నచ్చేసింది

Wed 06th Mar 2019 06:12 PM
hero nikhil,mega star chiranjeevi,compliments,arjun suravaram,teaser  టీజర్ మెగాస్టార్ కి నచ్చేసింది
Mega STar Praises ‘Arjun Suravaram’ Teaser టీజర్ మెగాస్టార్ కి నచ్చేసింది
Sponsored links

నిఖిల్ ‘అర్జున్ సుర‌వరం’ టీజ‌ర్‌ను ప్ర‌శంసించిన మెగాస్టార్ చిరంజీవి

యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్‌, ఆరా సినిమా ప్రై.లి. ప‌తాకాల‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల‌, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ‘అర్జున్ సుర‌వరం’. మార్చి 29న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా  ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇన్‌టెన్స్‌తో ఉన్న ఈ టీజ‌ర్ 24 గంట‌ల్లో 2.3 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసి ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాదు.. మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా ప్ర‌శంస‌లు రావ‌డం యూనిట్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. 

టీజ‌ర్ చాలా బావుంద‌ని ఎంటైర్ యూనిట్‌కు చిరంజీవి శుభాకాంక్ష‌లు అందించారు. యూనిట్‌ను, త‌మ చిత్రాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవికి హీరో నిఖిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

‘‘నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్న ‘అర్జున్ సుర‌వరం’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి 29న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత‌లు.

న‌టీన‌టులు: 

నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు..

సాంకేతిన నిపుణులు: 

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్

స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు 

నిర్మాత‌లు:  కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్ 

నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి 

సినిమాటోగ్ర‌ఫీ: సూర్య 

సంగీతం: స‌్యామ్ సిఎస్

ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్ 

ఫైట్స్: వెంక‌ట్ 

క్యాస్ట్యూమ్ డిజైన‌ర్:  రాగా రెడ్డి 

డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ 

ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్ 

Sponsored links

Mega STar Praises ‘Arjun Suravaram’ Teaser:

Megastar Chiranjeevi Compliments Nikhil’s ‘Arjun Suravaram’ Teaser

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019