అభిమానం హ‌ద్దులు దాటితే చెంప‌చెల్లు!

Wed 06th Mar 2019 04:14 PM
prabhas,baahubali,young lady slaps prabhas,prabhas saaho,shamshabad air port  అభిమానం హ‌ద్దులు దాటితే చెంప‌చెల్లు!
lady fan slaps baahubali prabhas అభిమానం హ‌ద్దులు దాటితే చెంప‌చెల్లు!
Sponsored links

మ‌న‌కు న‌చ్చివారు అనుకోకుండా క‌ల్లెదుటే స‌డెన్‌గా ప్ర‌త్య‌క్ష‌మైతే ఏం చేయాలో అర్థం కాదు. అది క‌లా నిజ‌మా అని మ‌న‌ల్ని మ‌న‌మే ప‌రీక్షించుకుంటాం. ఓవ‌ర్‌గా ఎగ్జైట్ అయితే ఆ స‌మ‌యంలో మ‌నం ఏం చేస్తున్నామో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నామో తెలియ‌కుండానే పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తించి ఓ షాక్‌లో వుండిపోతాం. అచ్చం ఇలాగే చేసిందో అమ్మాయి. `బాహుబ‌లి` సిరీస్‌ల‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ కి ప‌దిమెట్లు పైనే సింహాస‌నంపై కూర్చున్న ప్ర‌భాస్‌ని చూడాల‌ని, క‌ల‌వాల‌ని, ఒక్క‌సారి షేక్ హ్యాండ్ ఇవ్వాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. 

అలాంటి అవ‌కాశం శంషాబాద్ ఏయిర్ పోర్టులో ఓ యువ‌తికి ఎదురైంది. అనుకోకుండా ప్ర‌భాస్ శంషాబాద్ ఏయిర్ పోర్టులో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఎదురుగా వ‌స్తున్న ప్ర‌భాస్‌ని చూసి ఉక్కిరిబిక్కిరైన ఓ యంగ్ లేడీ వెంట‌నే ప్ర‌భాస్‌ని సెల్ఫీ అడిగేసింది. ప్ర‌భాస్ కూడా కూల్‌గా ఓకే చెప్పేశాడు. ఇంకేముంది ఆ యంగ్ లేడీ ఆనందానికి అవ‌ధులే లేకుండా పోయాయి. సెల్పీ దిగుతున్నంత‌సేపు బుజ్జి కుక్క‌పిల్ల‌లా ప్ర‌భాస్ ప‌క్క‌న ఒదిగిన ఆ యంగ్ లేడీ  ఫొటో తీయ‌డం పూర్త‌వ‌గానే త‌న ఎగ్జైట్ మెంట్‌ని త‌ట్టుకోలేక వెంట‌నే ప్ర‌భాస్ చెపని ఛెల్లు మ‌నిపించేసింది. 

ఈ హ‌ఠాత్ప‌రిణామానికి షాకైన డార్లింగ్ ప్ర‌భాస్ వెంట‌నే తేరుకుని చిన్న న‌వ్వు న‌వ్వి ఆ అమ్మాయి స్నేహితుడికి కూడా సెల్ఫీ ఛాన్స్ ఇచ్చేసి బుగ్గ నిమురుకుని అక్క‌డి నుంచి ఊడాయించాడు.  అభిమానం హ‌ద్దులు దాటితే చెంప ఛుల్ల‌వుతుంద‌ని ప్ర‌భాస్ సంఘ‌ట‌న‌తో నిరూపింతమైంది. ప్ర‌భాస్‌కు సంబ‌ధించిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Sponsored links

lady fan slaps baahubali prabhas:

young lady fan slaps prabhas

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019