Advertisement

‘బ్ర‌హ్మాస్త్ర‌’.. సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టిసారి

Tue 05th Mar 2019 08:20 PM
brahmastra,mahashivratri,kumbh mela,uttar pradesh,alia bhatt,ranbir kapoor,logo launch  ‘బ్ర‌హ్మాస్త్ర‌’.. సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టిసారి
Brahmāstra launches its logo on Maha Shivratri at the Kumbh Mela ‘బ్ర‌హ్మాస్త్ర‌’.. సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టిసారి
Advertisement

ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వ‌ర్ నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘బ్ర‌హ్మాస్త్ర‌’. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ధారులు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా లోగోను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగ కుంభ‌మేళాలో వినూత్నంగా విడుద‌ల చేశారు. 

ఈ లోగో విడుద‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా ర‌ణ‌భీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ప్ర‌యాగ‌కు వెళ్లారు. హీరోయిన్ అలియా భ‌ట్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్‌లో ప్రోగ్రాం వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో బ్ర‌హ్మాస్త్ర అనే లోగోను ఆకాశంలో ఆవిష్క‌రించడం విశేషం. ఇలా డ్రోన్స్ స‌హాయంతో ఆకాశంలో లోగోను ఆవిష్క‌రించ‌డం సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టిసారి. ఇలా గ్రాండ్‌గా విడుద‌ల చేసిన బ్ర‌హ్మాస్త్ర లోగో అక్క‌డకు వ‌చ్చిన వారంద‌రినీ ఆక‌ట్టుకుంది. 

బ్ర‌హ్మాస్త్ర ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొద‌టి భాగాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబ‌ర్ 25, 2019న హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌లయాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Brahmāstra launches its logo on Maha Shivratri at the Kumbh Mela:

The much anticipated Brahmastra logo is out

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement