ఛాంబ‌ర్ వేదిక‌గా కొత్త నాట‌కం షురువైంది!

Tue 05th Mar 2019 08:01 PM
maa elections,maa elections 2019,sivaji raja,naresh vk,rajasekhar,jeevitha,new game on maa elections  ఛాంబ‌ర్ వేదిక‌గా కొత్త నాట‌కం షురువైంది!
new drama start in maa elections ఛాంబ‌ర్ వేదిక‌గా కొత్త నాట‌కం షురువైంది!
Sponsored links

ఫిల్మ్‌ ఛాంబ‌ర్ వేదిక‌గా కొత్త నాట‌కం షురువైంది. `మా` మాధ్య‌క్షుడిగా శివాజీరాజా ప‌ద‌వీకాలం ముగిచ‌డంతో ఫిల్మ్ ఛాంబ‌ర్ సాక్షిగా కొత్త డ్రామా  మొద‌లైంది. గ‌తంలో జ‌రిగిన `మా` ఎన్నిక‌ల్లో ఎంత హైడ్రామా న‌డిచిందో అంద‌రికి తెలిసిందే. ఇక రాజేంద్ర‌ప్ర‌సాద్ `మా` అధ్య‌క్షుడిగా పోటీకిదిగిన సంద‌ర్భంలో జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఇంత ర‌చ్చ జ‌రిగుండ‌దేమో ఆ రేంజిలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాడీవేడీ మాట‌ల యుద్ధం న‌డిచింది. కామెడియ‌న్ రాజేంద్ర ప్ర‌సాద్ ఏంటీ `మా` అధ్య‌క్షుడు ఏంటీ? అని ఆయ‌న‌పై పోటీకి దిగిన జ‌య‌సుధ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు దారితీసింది. 

జ‌య‌సుధ‌కు టీడీపీ స‌పోర్ట్‌గా నిలిస్తే రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు తెలంగాణ నేత త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ వ‌ర్తం అండ‌గా నిలిచారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను గెలిపించి త‌మ‌ పంతం నెగ్గించుకున్నారు. ఇక ఆ త‌రువాత అధ్య‌క్ష పీఠం ఎక్కిన శివాజీరాజా మీదా ఇదే త‌ర‌హా పెద్ద ర‌చ్చే జ‌రిగింది. ఆయ‌న‌కు చిరంజీవి అండ‌గా నిల‌వ‌డంతో శివాజీరాజా `మా` అధ్య‌క్ష‌డు అయ్యాడు. ఇక తాజాగా జ‌ర‌గ‌బోతున్న `మా` ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అదే సీన్ రిపీట్ కాబోతోంది. శివాజీరాజా ప‌క్క‌నే వుంటూ అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ర‌చ్చ‌చేసిన న‌రేష్ ఇప్పుడు శివాజీరాఆకు పోటీగా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్నాడు. 

వీరికి హీరో రాజ‌శేఖ‌ర్‌, జీవిత మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. శివాజీరాజాకు చిరు అండ వుండ‌నే వుంది. అయినా చిరు మాకే ఈ ద‌ఫా స‌పోర్ట్ చేస్తార‌న్న అతి న‌మ్మ‌కంతో రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌, న‌రేష్ ఆదివారం చిరంజీవిని క‌లిసి మ‌ద్ద‌తు త‌మ‌కే ఇవ్వాల‌ని కోర‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. రెండు ప్యానెల్‌ల ప‌రిస్థితి ఇలా వుంటే రామాయ‌ణంలో పిడ‌క‌ల వేట‌లాగా మ‌ధ్య‌లో శ్రీ‌రెడ్డి దూరి న‌రేష్ వ‌ర్గాన్ని, న‌రేష్‌ని హెచ్చ‌రిస్తోంది. నువ్వేంటీ ... నీవెన‌కున్న ప్యాన‌లేంటి? వాళ్ల‌ని న‌మ్ముకుంటే మునిగిపోతావు అన్న‌ట్టుగా న‌రేష్‌ను హెచ్చ‌రించ‌డం న‌రేష్ వ‌ర్గానికి మింగుడు ప‌డ‌ని ప‌రిస్థితి. ఛాంబ‌ర్ వేదిక‌గా జోరందుకున్న కొత్త నాట‌కం మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందో.. ఎలాంటి నిజాల్ని బ‌య‌ట‌పెడుతుందో చూడాలి.    

Sponsored links

new drama start in maa elections:

maa elections hungama become new drama

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019