Advertisement
TDP Ads

బ‌యోపిక్ అంటే పారిపోతున్న ద‌ర్శ‌కుడు!

Sun 03rd Mar 2019 07:12 PM
krish,ntr biopic,ntr kathanayakudu,ntr mahanayakudu,ntr biopic,balakrishna,krish jagarlamudi  బ‌యోపిక్ అంటే పారిపోతున్న ద‌ర్శ‌కుడు!
krish scaring about biopics బ‌యోపిక్ అంటే పారిపోతున్న ద‌ర్శ‌కుడు!
Advertisement

బ‌యోపిక్ పేరు చెబితేనే ఉలిక్కిప‌డి పారిపోతున్నాడో ద‌ర్శ‌కుడు. ఎవ‌రు ఆ పేరెత్తినా భ‌య‌ప‌డుతున్నాడ‌ని టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శ‌కుడు? ఏమాక‌థ?.. ఇప్ప‌టికే అర్థ‌మై వుంటుంది య‌స్ ఆ ద‌ర్శ‌కుడు మీరు గెస్ చేసిన‌ట్టే క్రిష్‌. గ‌మ్యం, వేదం, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి (ఇందులోనూ ఏమీ లేదులే) చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న క్రిష్ అంత‌కు మించిన ఘోర ప‌రాభ‌వాన్ని ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో సొంతం చేసుకున్నాడు.

ఇది చాల‌ద‌నుకున్నాడో ఏమో గానీ పోయి పోయి బాలీవుడ్ `ట్రాన్స్ ఫార్మ‌ర్` కంగాన ర‌నౌత్‌ని ట‌చ్ చేశాడు. ఏకంగా భారీ షాక్‌కు గుర‌య్యాడు. క్రిష్‌ చేసిన `మ‌ణిక‌ర్ణిక‌`ని భోజ్‌పురి సినిమాతో పోల్చిన కంగ‌న‌ ఆ త‌రువాత మార్పులు చేర్పులు చేస్తూ మిగ‌తా భాగాన్ని తానే పూర్తి చేసుకుని ద‌ర్శ‌కురాలిగా త‌న పేరునే వేసుకుంది. దీంతో హ‌ర్ట్ అయిన క్రిష్ కంగ‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం..వాటికి కంగ‌న కౌంట‌ర్ ఇవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్నట్టుగా ఒక సినిమా (మ‌ణిక‌ర్ణిక‌) త‌న‌ది కాకుండా పోయింది. మ‌రో సినిమా (ఎన్టీఆర్ బ‌యోపిక్‌) త‌ను చేసినా ఫ‌లితం లేక‌పోగా ద‌ర్శ‌కుడిగా అప‌కీర్తిని తెచ్చిపెట్టింది.

దీంతో షాక్‌కు గురైన క్రిష్ బ‌యోపిక్ అంటేనే ఉలిక్కిప‌డుతున్నాడ‌ట‌. ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో తెలుగులో, `మ‌ణిక‌ర్ణిక‌`తో బాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడిగా కోలుకోలేని దెబ్బ‌తిన్న క్రిష్ కావాల‌ని వ‌చ్చి `ఎన్టీఆర్` బ‌యోపిక్‌ని తానే తీస్తాన‌ని బాల‌కృష్ణ‌తో వాదించి మ‌రీ ఆ బాధ్య‌త‌ల్ని తీసుకుని చివ‌రికి రెంటికి చెడ్డ రేవ‌ట‌గా మారిపోయారు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆలోచిస్తున్న ఆయ‌న వెంట‌నే కొత్త సినిమాని మొద‌లుపెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. అయితే `మ‌ణికర్ణిక‌` వివాదం, ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల డిజాస్ట‌ర్‌.. వంటి కార‌ణాల‌తో తెలుగులో క్రిష్‌తో సినిమా చేయ‌డానికి ఏ హీరో ముందుకు రావ‌డం లేద‌ట‌. త‌న‌ని ఈ గండం నుంచి గ‌ట్టెక్కించే హీరో కోసం క్రిష్ ఎదురుచూస్తున్నాడని తెలిసింది.

krish scaring about biopics:

krish jagarlamudi awaiting biopics

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement