Advertisementt

Ads by CJ

‘షార్ట్ టెంప‌ర్’ వివరాలివే

Sat 02nd Mar 2019 05:11 PM
short temper,short temper movie opening,raghava,naveen,aditya ohm,short temper movie  ‘షార్ట్ టెంప‌ర్’ వివరాలివే
Short Temper Movie Opening details ‘షార్ట్ టెంప‌ర్’ వివరాలివే
Advertisement
Ads by CJ

ప్ర‌వీణా క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.ఆర్‌.ఆర్‌. నిర్మిస్తున్న చిత్రం షార్ట్ టెంప‌ర్‌. న‌వీన్, ఆదిత్య ఓమ్‌, షాలిని చౌహ‌న్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం శుక్ర‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజాకార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ క్లాప్ కొట్ట‌గా, ఫ‌స్ట్‌షాట్‌కి మా అధ్య‌క్షులు శివాజీరాజా కెమెరా స్విచాన్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో తాగుబోతు ర‌మేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ఓపెనింగ్‌కి నేను రావ‌డానికి ముఖ్య‌కార‌ణం ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాకు ప‌ది ఏళ్ళ నుంచి మంచి స్నేహితుడు. ఆ స్నేహంతోనే నేను ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర‌లో న‌టించాను. ఈ సినిమా బాగా ఆడాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. ఈ టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ర‌చ్చ ర‌వి మాట్లాడుతూ.. ‘‘కామెడీ సినిమాలు ఆడితే ఫ్యామిలీ అంతా క‌లిసి ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రం యాక్ష‌న్‌, కామెడీ మూవీ. ఈ చిత్రంలో న‌టించే వాళ్ళంద‌రూ కొత్త‌వాళ్ళు. అంద‌రూ వీళ్ళ‌ని ఎంక‌రేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ.. ‘‘ఇంత‌కు ముందు నేను రెండు చిత్రాలు నిర్మించాను. కాని వాటికంటే ఈ చిత్రం చాలా పెద్ద బ‌డ్జెట్ చిత్రం. ఇందులో మా అబ్బాయే హీరో. ఈ చిత్రంలోని స‌న్నివేశాల‌న్నీ బ్యాకాంక్‌లో చిత్రీక‌ర‌ణ జరపుతాము. ఇది చాలా డిఫ‌రెంట్ స్టోరీ ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో రాలేదు’’ అని అన్నారు.

హీరో న‌వీన్ మాట్లాడుతూ.. ‘‘రాఘ‌వ‌గారు స్టోరీని చాలా బాగా డిజైన్ చేశారు. సార్ క‌థ‌ను చెప్ప‌డం కూడా చాలా చ‌క్క‌గా చెప్పారు. ఆయ‌న క‌థ చెపుతుంటే క‌థ‌ని నేను చూసిన‌ట్లు అనిపించింది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ రాఘ‌వ మాట్లాడ‌తూ.. ‘‘నేను ఇండ‌స్ట్రీలో 15 సంవ‌త్స‌రాలుగా ఉంటున్నాను. రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా ఎన్నో సినిమాలు చేశాను. కాని అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ఈ సినిమా. ప్రొడ్యూస‌ర్‌గారు చాలా మంచివారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌ కాకుండా చేశారు. అందుకు ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో హీరో చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డారు. తన పాత్ర కోసం రోజుకి 8గంట‌ల పాటు జిమ్‌లోనే గ‌డిపేవారు. యాక్టింగ్ క్లాసెస్‌కి వెళ్ళి బాగా నేర్చుకున్నారు. నాకు కామెడీ ట‌చ్ ఉన్న చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో అలీగారు ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించారు. మ‌రో ముఖ్య పాత్ర‌లో ఆదిత్య ఓమ్ గారు కూడా న‌టించారు. మంచి ప్యాడింగ్ ఉన్నారు. మార్చి ఎండింగ్ నుంచి షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. మొత్తం రెండు షెడ్యూల్స్‌. ఒక‌టి బ్యాంకాక్‌లో.. మ‌రోటి ఏద‌న్నా ఒక చిన్న విలేజ్‌లో ఉంటుంది..’’ అని అన్నారు. 

హీరోయిన్ షాలిని, సుభాంగిపంత్‌ మాట్లాడుతూ.... ‘‘మాకు ఈ చిత్రంలో అవ‌కాశం ఇచ్చినందుకు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ముందుగా ఇంత మంచి పాత్ర‌లు రాసినందుకు మా డైరెక్ట‌ర్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్ర యూనిట్ మొత్తం మాకు ఎంతో స‌హ‌క‌రించింది. హీరో కూడా చాలా హెల్ప్ చేశారు’’ అని అన్నారు.

Short Temper Movie Opening details:

Short Temper Movie Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ