ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> anil ravipudi rigisterd interesting title for mahesh?

సోష‌ల్ మీడియాను వాడేస్తున్న `ఎఫ్‌2` డైరెక్ట‌ర్‌?

ఈ సంక్రాంతికి ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజైన సినిమా `ఎఫ్‌2`. వెంక‌టేష్, వ‌రుణ్‌తేజ్ తొలి క‌ల‌యిక‌లో అనిల్ రావిపూడి రూపొందించిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.  సంక్రాంతి బ‌రిలో ఈ సినిమాతో పాటు నిలిచిన‌  విన‌య విధేయ రామ‌, ఎన్టీఆర్ నాయ‌కుడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డితే అనూహ్యంగా `ఎఫ్‌2` భారీ వ‌సూళ్లు రాబ‌ట్టి వంద‌ కోట్ల క్ల‌బ్‌లో చేరింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని కూడా తీసుబోతున్నాం అంటూ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సినిమా చివ‌ర‌లో ఎండ్ కార్డ్ వేశాడు. 

అయితే ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ క్రేజ్‌లో వున్న అనిల్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్‌బాబుతో చేయ‌బోతున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ మ‌హేష్ ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న కోసం సిద్ధం చేసిన మూడు క‌థ‌ల్ని రిజెక్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌హేష్ `మ‌హార్షి` చిత్రం త‌రువాత  సుకుమార్‌తో కాకుండా అనిల్ రావిపూడితో చేయ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని తేలిపోయింది. అనిల్ రావిపూడి `ఎఫ్‌2`ని తెర‌కెక్కించిన విధానం మ‌హేష్‌కు బాగా న‌చ్చింద‌ట‌. స్వ‌త‌హాగా సెట్‌లో టీమ్ అంద‌రిపై సెటైర్లు వేసే మ‌హేష్ త‌న టైమింగ్‌కి తగ్గ క‌థతో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను దిల్ రాజుతో క‌లిసి అనిల్ రావిపూడి నిర్మించే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. 

ఈ సినిమా కోసం ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ని కూడా రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. భార్యా భ‌ర్త‌ల ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ నేప‌థ్యంలో మంచి సందేశాన్ని మిక్స్ చేసి `ఎఫ్‌2` చిత్రాన్ని రూపొందించిన అనిల్ రావిపూడి ఈ ద‌ఫా ప్రిన్స్ మ‌హేష్ కోసం సోష‌ల్ మీడియాను వాడేస్తున్నాడ‌ట‌. అందుకే ఈ సినిమాకు `వాట్సాప్‌` అనే టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేయించాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియా వాట్సాప్ నేటి స‌మాజాన్ని ఏ స్థాయిలో ప్ర‌భావితం చేస్తోందో అంద‌రికి తెలిసిందే. ఈ అంశాన్నే ప్ర‌ధాన క‌థావ‌స్తువుగా తీసుకుని అనిల్ రావిపూడి తాజా చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

anil ravipudi rigisterd interesting title?

anil ravipudi rigisterd interesting title for mahesh?
anil ravipudi
mahesh babu
mahesh
anil ravipudi new film title
dil raju
f3
whatsapp