స్టార్ హీరోలకు ఈ కష్టం తీరేది ఎప్పుడో?

Sat 16th Feb 2019 09:34 PM
pooja hegde,allu arjun,trivikram srinivas,next movie,select  స్టార్ హీరోలకు ఈ కష్టం తీరేది ఎప్పుడో?
Same Heroines Repeats in Star Heroes Movies స్టార్ హీరోలకు ఈ కష్టం తీరేది ఎప్పుడో?
Sponsored links

టాలీవుడ్ హీరోలకు హీరోయిన్స్ కరువయ్యారా... అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ హీరోలకు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కనబడడం లేదు. కాజల్, సమంత, తమన్నా, అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ సీనియర్స్ లిస్ట్ లోకి చేరిపోవడంతో.. ప్రస్తుతం స్టార్ హీరోలకు హీరోయిన్స్ కొరత ఏర్పడింది. ఏదో ఒక హీరోయిన్ ఒక హిట్ కొట్టాక ఆమె వెనక పడాల్సిన పరిస్థితి అగత్యం ఏర్పడింది. ఇక ఆ హీరోయిన్ కి మళ్ళీ ప్లాప్ పడితే మరో ఆప్షన్ వెతుక్కోవడం. గత ఏడాది అను ఇమ్మాన్యుయేల్ కాస్త స్టార్ హీరోల సినిమాల్లో కనబడితే... రెండు మూడు ప్లాప్స్ పడేసరికి అనుని పక్కన పడేసారు. ఇక కైరా అద్వానీ పరిస్థితి అదే. భరత్ అనే నేనుతో పర్వాలేదనిపించే హిట్ తో ఉంటే.. రామ్ చరణ్ తో వినయ విధేయ రామతో ప్లాప్ పడేసరికి కైరాకు అవకాశాలు మొహం చాటేశాయి.

ఇక డీజేతో యావరేజ్ హిట్ కొట్టిన పూజ హెగ్డే వెనకాలే స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు పడుతున్నారు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరి సరసన పూజ హెగ్డేనే హీరోయిన్. మరి పూజ హెగ్డేలో గ్లామర్ ఉంది కానీ.. ఆమెకి నటన ఓ అన్నంత రాదు. కానీ హీరోలకు వేరే ఆప్షన్ లేక పూజ కోసమా వెంటపడుతున్నారు. పూజ హెగ్డే గ్లామర్ కి పడిపోతున్నారు. కాదు కాదు క్రేజ్ ఉన్న హీరోయిన్ దొరక్క ఆమె చుట్టూనే తిరగాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు పూజ హెగ్డే కి ఒక బ్లాక్ బస్టర్ హిట్లేదు. డీజే దువ్వాడ జగన్నాధం యావరేజ్ హిట్ అయితే.. అరవింద సమేత కూడా యావరేజే అయ్యింది. కానీ పూజ డిమాండ్ తగ్గలేదు.

ఇప్పటికే పూజ నటిస్తున్న మహేష్ మహర్షి సినిమా విడుదలకు రెడీ అవుతుంటే.. ప్రభాస్ సినిమా సెట్స్ మీదుంది. ఇక తాజాగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమాలోనూ పూజనే ఫైనల్ అని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాధం సినిమాతో ఒక ఊపు ఊపిన పూజ హెగ్డే ఇప్పుడు మరోమారు జతకడుతుంది. మరి పూజ హెగ్డే లక్కో. హీరోలకు వేరే దిక్కులేకో. పూజ హెగ్డేనే అందరికి బెస్ట్ ఆప్షన్ అయ్యింది.

Sponsored links

Same Heroines Repeats in Star Heroes Movies:

Pooja Hegde selected for Allu Arjun and Trivikram Film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019