Advertisement

‘యాత్ర’ హిట్‌కి, ‘కథానాయకుడు’ ఫట్‌కి కారణాలు?

Wed 13th Feb 2019 02:01 PM
yatra,biopic,ntr kathanayakudu,krish,mahi v raghav,hit and flop  ‘యాత్ర’ హిట్‌కి, ‘కథానాయకుడు’ ఫట్‌కి కారణాలు?
Reasons for Yatra Hit and NTR Kathanayakudu Flop ‘యాత్ర’ హిట్‌కి, ‘కథానాయకుడు’ ఫట్‌కి కారణాలు?
Advertisement

నందమూరి బాలకృష్ణ అంటే టాప్‌స్టార్‌. విపరీతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌. ఇక ఆయనే మొదటి సారి నిర్మాతగా, అందునా తన తండ్రి, ఆంధ్రుల ఆరాధ్యదైవం ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ అనేసరికి అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి క్రిష్‌ ఎంటర్‌ కావడం, సెన్సిబుల్‌, ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌గా ఆయనకి ఉన్న పేరు, బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఆయన చూపిన ప్రతిభతో ఈ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. కానీ బాలయ్యకు ఎక్కువగా అభిమానులు ఉండే మాస్‌లో, బి, సి, సెంటర్లలోని ప్రేక్షకులు బాలయ్య నుంచి డ్రై సినిమాని ఊహించలేదు. అది ఒక మైనస్‌ అయింది. 

ఇక ‘కథానాయకుడు’లో ఏకంగా బాలకృష్ణ, విద్యాబాలన్‌, సుమంత్‌, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు ఎందరో పేరున్న నటీనటులు ఉండటంతో విడుదలకు ముందు ఇది హాట్‌కేక్‌లా అమ్ముడుపోయింది. బాలయ్య మార్కెట్‌కి మించిన బిజినెస్‌ జరగడం, బయ్యర్లు పోటీ పడటంతో ఏకంగా 70కోట్లకు పైగా ప్రీరిలీజ్‌ చేసింది. కానీ చిత్రం అనూహ్యంగా డిజాస్టర్‌ అయింది. అదే ‘యాత్ర’ విషయానికి వస్తే ఈ చిత్రం ప్రారంభం నుంచి ఎలాంటి అంచనాలు లేవు. ఓ పరభాషా నటుడు వైఎస్‌గా నటిస్తుండటం, దర్శకుడు మహి.వి.రాఘవకి ఎలాంటి ఫాలోయింగ్‌ లేకపోవడం వంటివి ఈ చిత్రం లోప్రొఫైల్‌ మెయిన్‌ చేయడానికి దోహదపడ్డాయి. కానీ సినిమాలో కంటెంట్‌, తీసిన విధానం, పాత్రల్లో నటులు జీవిస్తే స్టార్స్‌ చిత్రాలనే కాకుండా ఎవరి చిత్రమైనా ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అందునా మరీ ఎక్కువ బడ్జెట్‌తో కాకుండా మినిమం బడ్జెట్‌తో తెరకెక్కించడం వీలైంది. 

‘కథానాయకుడు’ 20కోట్లు వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిస్తే, అదే 20కోట్లను రాబడితే ‘యాత్ర’ సూపర్‌హిట్‌ అయ్యే పరిస్థితి. అందునా మమ్ముట్టి హీరో కావడంతో తమిళం, మలయాళంలో కూడా క్రేజ్‌ ఉంటుంది. తద్వారా డబ్బింగ్‌రైట్స్, శాటిలైట్‌ రైట్స్‌కి మరింత డిమాండ్‌ ఉంటుందని దర్శకనిర్మాతలు బాగానే ఊహించారు. మరోవైపు ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్‌ మాత్రమే 8కోట్లకు అమ్ముడుపోయాయని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే సగం బడ్జెట్‌ డిజిటల్‌ రైట్స్‌ ద్వారానే వచ్చినట్లవుతుంది. 

శాటిలైట్‌, డబ్బింగ్‌ రైట్స్‌ వంటివి కలిస్తే బడ్జెట్‌ మొత్తం అక్కడే వచ్చేస్తుంది. ఇక థియేటికల్‌ రైట్స్‌ ద్వారా వచ్చింది మొత్తం లాభం కిందనే లెక్క. ఏ లెక్కలు ఎలా ఉన్నా ‘యాత్ర’ చిత్రం మొదటి వారంలోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇలా కర్ణుడి చావుకి ఎన్ని కారణాలో ‘కథానాయకుడు’ డిజాస్టర్‌కి, ‘యాత్ర’ సక్సెస్‌కి అన్ని కారణాలు ఉన్నాయని ఒప్పుకోకతప్పదు.

Reasons for Yatra Hit and NTR Kathanayakudu Flop :

Yatra picturised with low budget 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement