రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాల్లో కాంట్రవర్సీ లేకుండా ఏ సినిమా తీయడు. కనీసం ఆ విధంగా అయినా సినిమాకి ప్రమోషన్ అయ్యి మంచి బిజినెస్ జరుగుతుందని రాము భావన. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కి కౌంటర్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను చకచకా రెడీ చేస్తున్నాడు. ఇందులో నందమూరి ఫ్యామిలీతో పాటు చంద్రబాబు నాయుడుని కూడా భయంకరంగా టార్గెట్ చేస్తారు.
మరి ఈ సినిమా రిలీజ్ అయితే నందమూరి ఫ్యామిలీతో పాటు చంద్రబాబుకి కూడా బాగా మైనస్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపాలని భావిస్తున్నారు. ఆపుదాం అనుకున్నారు మరి ఎలా ఆపుతారు అనేది పెద్ద ప్రశ్న. సెన్సార్ దగ్గర ఆపుదాం అంటే సెన్సార్ జరిగేది ఆంధ్రప్రదేశ్ లో కాదు హైదరాబాద్ లో. సో ఇక్కడ కుదరదు.
మరి ఏపీ లో రిలీజ్ అవ్వకుండా ఆపుదాం అంటే మిగిలిన ఏరియాస్ లో రిలీజ్ అయిపోతుంది. సో అది కూడా వర్క్ అవ్వదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆలోచన వేరుగా వుందని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండా కోర్ట్ కి వెళ్లాలని నందమూరి ఫ్యామిలీ భావిస్తుంది.
‘‘మా నాన్న కథ, మా కుటుంబం కథ, మా ఫ్యామిలీ వ్యవహారం సినిమాగా తీసి రచ్చ చేసే హక్కు ఎవరు ఇచ్చారు..’’ ఇదీ నందమూరి ఫ్యామిలీ కోర్టుల ద్వారానో? మరో విధంగానో వ్యక్తం చేయబోయే అభ్యంతరం అని తెలుస్తోంది.
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఈ పాయింట్ ని రైజ్ చేస్తూ కోర్ట్ కి వెళ్లాలని చూస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు బాలయ్య సైలెంట్ గా ఉన్నాడని టాక్. సరైన టైంకి ఫ్యామిలీ పర్మిషన్, ఫ్యామిలీ ప్రైవసీ హక్కుల పాయింట్ ద్వారా సినిమాను ఆపించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. రామ్ గోపాల్ వర్మ ఇటువంటివి ఎన్ని చూసి ఉంటాడు...