ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Sethupathi and Trisha lovely hug

వేదిక‌పై ఊహించ‌ని హ‌గ్ ల‌వ్‌లీగా వుంది!

ఇటీవ‌ల ఓ వేదిక‌పై ఊహించ‌ని చిత్రం జ‌రిగింది. ఎవ‌రూ ఊహించ‌ని జంట క‌లిసి న‌టించిన త‌మిళ సినిమా `96`. ఫీల్ గుడ్ చిత్రంగా నిలిచింది. ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేసిన ఈ సినిమాపై ఇత‌ర భాష‌ల నిర్మాత‌లు సైతం మ‌న‌సుప‌డ్డారు. సినిమా విడుద‌ల‌కు ముందే ఆ చిత్ర రీమేక్ హ‌క్కుల్ని నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకుంటే ఇత‌ర భాష‌ల వాళ్లు భారీ మొత్తం చెల్లించి రీమేక్ హ‌క్కుల్నిద‌క్కించుకున్నారు. ఈ చిత్రం ఇటీవ‌లే వంద రోజులు పూర్తి చేసుకుంది. దానికి సంబంధించిన వేడుక ఇటీవ‌లే చెన్నైలో జ‌రిగింది. ఆ వేడుక జ‌రుగుతున్న వేదిక‌పై ఊహించ‌ని సంఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌మిళంలో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరుతెచ్చుకుంటూ వ‌రుస విజ‌యాన్ని సొంతం చేసుకుంటున్న హీరో విజ‌య్ సేతుప‌తి, క్రేజీ హీరోయిన్ త్రిష క‌లిసి ఈ సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. 

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌తేడాది విడుద‌లై ప్రేమ‌క‌థా చిత్రాల్లోనే కొత్త ఒర‌వ‌డిని సృష్టించిన సినిమాగా నిలిచింది. 90ల ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. ఇందులో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించినా ఒక్క స‌న్నివేశంలోనూ త్రిష‌ని తాకడు. కానీ ఈ చిత్ర శ‌త‌దినోత్స‌వ సంబ‌రం జ‌రుపుకుంటున్న వేళ వేదిక‌పైనే త్రిష‌ను ఆత్మీయంగా హ‌గ్‌ చేసుకోవ‌డం ల‌వ్‌లీగా అనిపించింది. ఊహించ‌ని ఈ హ‌గ్‌కు త్రిష సంబ‌ర‌ప‌డిపోయింద‌ట‌. ఇద్ద‌రు  ఒక్కసారి సినిమాలోని తాము పోషించిన పాత్ర‌ల్ని గుర్తుచేసుకున్నార‌ట‌. వేదిక‌పై ఈ చిలిపి స‌న్నివేశం ఆవిషృతం కావ‌డానికి సీత మాజీ భ‌ర్త పార్తీబ‌న్ స‌ల‌హానే కార‌ణ‌మ‌ని తెలిసింది. 

vijay sethupathi hugs trisha

Vijay Sethupathi and Trisha lovely hug
vijay sethupathi
trisha
96
tamil film 96
parthiban
96 hundred days function