నభకు ఎలా సాధ్యమవుతోంది..?!

Sun 10th Feb 2019 03:00 PM
nabha natesh,disco raja,ismart shankar  నభకు ఎలా సాధ్యమవుతోంది..?!
How is Nabha Doing it నభకు ఎలా సాధ్యమవుతోంది..?!
Sponsored links

అప్పట్లో ఒక హీరోయిన్ ను వెతికిపట్టుకోవాలంటే క్షీరసాగర మధనం చేసినంత పనయ్యేది మన నిర్మాతలకు.. హీరోల పక్కన బాగుండాలి, కథకు సరిపడాలి, డైలాగులు బాగా చెప్పగలగాలి, కెమెరా ముందు అందంగా కనిపించాలి. ఇలా చాలా ఉండేది. కానీ.. ఇప్పుడు హీరోయిన్ ను పట్టుకోవడానికి పాలు తోడుకొని పెరుగు అయ్యేంట సమయం కూడా పట్టడం లేదు. పూటకో హీరోయిన్ పుట్టుకొస్తున్న ఈ తరుణంలో.. హీరోయిన్ అవ్వడం కంటే.. హీరోయిన్ అయ్యాక తన కెరీర్ ను నిలబెట్టుకోవడం సదరు భామకు పెద్ద టాస్క్ అయిపోయింది. ముఖ్యంగా.. మొదటి సినిమా విడుదలయ్యాక ఆ సినిమా రిజెల్ట్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు దక్కించుకోవాలంటే అందం, అదృష్టం, అభినయ సామర్ధ్యంకి మించి ఏదో ఉండాలి. అదేంటనేది మన నవతరం భామలకి చాలామందికి తెలియడం లేదు కానీ.. నభ నటేష్ మాత్రం భలే క్యాచ్ చేసింది. 

ప్రస్తుతం అమ్మడి చేతిలో రవితేజ డిస్కో రాజా, రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలున్నాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ కన్నడ భామకు సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్రమోషన్స్ మీద మంచి పట్టు ఉండడమే అందుకు కారణమని తెలుస్తోంది. సినిమాల ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా అమ్మడు ఒక పి.ఆర్ టీం ను మైంటైన్ చేస్తోంది. సినిమాల విడుదల తేదీలతో సంబంధం లేకుండా ప్రతివారం ఒక ఫోటోషూట్ ను వదులుతుంది. అది కూడా మామూలుగా కాదండోయ్.. మాంచి సెన్సియస్ గా ఉన్న ఫోటోలు వదులుతుంది. దాంతో కుర్రకారు నభకు బాగా అడిక్ట్ అయిపోతున్నారు. యూత్ లో మంచి క్రేజ్ తోపాటు ఫాలోయింగ్ కూడా ఉండడంతో ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకనిర్మాతలు, హీరోలు కూడా పెద్దగా ఆలోచించడం లేదు.

Sponsored links

How is Nabha Doing it:

All the other heroines are shocked with nabhas managing talent both in media and cinema 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019