విజ‌య్, వెన్నెల కిషోర్ కుమ్మేశారుగా!

Sun 10th Feb 2019 09:02 AM
vijay deverakonda,vennela kishore,dear comrade,kranthi madhav,sangeetha mobiles ad,sangeetha mobiles  విజ‌య్, వెన్నెల కిషోర్ కుమ్మేశారుగా!
vijay devarakonda sangeetha ad విజ‌య్, వెన్నెల కిషోర్ కుమ్మేశారుగా!
Sponsored links

విజ‌య్ దేవ‌ర‌కొండ. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఏ నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఇండ‌స్ట్రీని `అర్జున్‌రెడ్డి` సినిమాతో అంత‌గా ప్ర‌భావితం చేశాడీ హీరో. వ‌ర్మ‌కే ముద్దొచ్చే ఇత‌గాడి చేష్ట‌లు రౌడీ ఫ్యాన్స్‌ని కూడా స‌మ్మోహితుల్ని చేసేస్తున్నాయి. నిన్న‌టికి నిన్న ఇద్ద‌ర‌మ్మాయిల వీడియోకి ఫిదా అయిన‌ ఈ రైజింగ్ స్టార్ వ‌రుస సినిమాల‌తో య‌మ‌బిజీగా మారిపోయాడు. `గీత గోవిందం` సినిమాతో వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిన విజ‌య్ దేవ‌ర‌కొండ టాలీవుడ్‌లో ఇప్పుడు ఏం చేసినా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోతోంది. వ‌రుస సినిమాల‌తో మాంచి స్పీడుమీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ అంతే స్పీడుగా యాడ్ ఫిల్మ్ చేస్తూ ప‌లు క్రేజీ బ్రాండ్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయాడు.  

ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న `డియ‌ర్ కామ్రేడ్‌`లో న‌టిస్తున్న విజ‌య్ త‌న మిత్రుడు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న సినిమాలోనూ న‌టిస్తున్నాడు. తాజాగా విజ‌య్ సంగీతా మోబైల్స్ కోసం న‌టించిన ఇన్నోవేటివ్ యాడ్ ఫిల్మ్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండ్‌గా మారింది. ఈ యాడ్‌లో విజ‌య్‌తో పాటు ఓ గొర్రె (గ్రాఫిక్‌) న‌టించింది. దానికి వాయిస్ ఇచ్చింది. క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్‌. మేక ఆకారంలో వున్న వెన్నెల కిషోర్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల మ‌ధ్య వ‌చ్చే సంభాష‌ణ కూడా మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటోంది. ఒక గెర్రె వెళుతోంది క‌దా అని దాన్ని మిగ‌తా గొర్రెలు అనుస‌రిస్తున్న‌ట్టుగా వ‌రుస‌గా విద్యార్థులు లైన్‌లో వెళుతుంటారు. ఈ యాడ్ నౌక‌రీ డాట్ కామ్ కోసం చేస్తే అప్ప‌ట్లో బాగా పాపుల‌ర్ అయింది. అదే థీమ్‌ని తీసుకుని సంగీతా మోబైల్స్ కోసం చేసిన యాడ్ కూడా యూట్యూబ్‌లో భ‌లే పేలుతోంది.

Sponsored links

vijay devarakonda sangeetha ad:

vijay devarakonda sangeetha mobiles ad

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019