‘యాత్ర’ విడుదలైంది.. ‘మాట’ మొదలవుతోంది

Fri 08th Feb 2019 10:02 PM
ys rajasekhar reddy,biopic,maata movie,ysr,ys jagan  ‘యాత్ర’ విడుదలైంది.. ‘మాట’ మొదలవుతోంది
One More Movie on YS Rajasekhar Reddy ‘యాత్ర’ విడుదలైంది.. ‘మాట’ మొదలవుతోంది
Sponsored links

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిలా.. ప్రజల గుండెల్లో గుడి కట్టించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర అంటూ మహి వి రాఘవ్... వైఎస్సార్ పాదయాత్ర చేసి పార్టీని ఎలా అధికారంలోకి తెచ్చి నాయకుడయ్యాడో.. చూపించాడు. మహి, రాజశేఖర్ రెడ్డి మీద తీసిన యాత్ర నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు యాత్ర విడుదలైంది.. ఇప్పుడు మరో కొత్త దర్శకుడు అశ్విని చిత్రాలయ బ్యానర్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మాట సినిమా మొదలెట్టబోతున్నాడు. ఆమెబా సురేష్ అనే కొత్త దర్శకుడు వైఎస్సార్ నాయకుడిగా ప్రజలకిచ్చిన మాటను.. ప్రజలు ఎలా అనుక్షణం గుర్తుచేసుకుంటున్నారో.. అనేది తెర  మీద చూపించబోతున్నాడు. తాజాగా మాట మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. 

ఆ మోషన్ పోస్టర్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలు ఎంతగా ఆరాధిస్తున్నారో చూపించాడు దర్శకుడు సురేష్. ఆ పోస్టర్ బ్యాగ్రౌండ్ లో అసెంబ్లీకి సంబందించిన సీన్స్ ప్లే చేస్తూ.. బాధ, నిస్సహాయత, నిరాశ, బ్రతుకు భారం, కంట నీటిని తుడిచిన మాట.. మరపురాని రాజన్న మాట... మరచి... మరచి... మరచిపోలేకున్నాం.. దైవమా.. మా రాజన్న అంటూ దీనంగా బ్యాగ్రౌండ్ లో వినబడుతున్న గొంతుతో ఈ మోషన్ పోస్టర్ ని రూపొందించారు. ఇంకా ఈ చిత్ర విశేషాలు  తెలీయాల్చి  వుంది. 

Click here To Maata Motion Poster

Sponsored links

One More Movie on YS Rajasekhar Reddy:

YSR Maata Movie Ready to Start

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019