బాలీవుడ్ బ్యాండ్ బ‌జాయిస్తుంద‌ట‌!

Fri 08th Feb 2019 09:48 PM
kangana,kangana ranaut,manikarnika,kngana angry on bollywood,  బాలీవుడ్ బ్యాండ్ బ‌జాయిస్తుంద‌ట‌!
kangana warnig to bollywood celebs బాలీవుడ్ బ్యాండ్ బ‌జాయిస్తుంద‌ట‌!
Sponsored links

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చ‌కున్న కంగ‌నా ర‌నౌత్ శివాలెత్తుతోంది. త‌న‌ని ఒంట‌రిని చేసి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని బాలీవుడ్‌పై మండిప‌డుతోంది. `మ‌ణిక‌ర్ణిక‌` స‌వినిమాతో కంగ‌న చుట్టూ వివాదాలు మొద‌లైన విష‌యం తెలిసిందే. వీటిపై గ‌ట్టి కౌంటర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది కంగ‌న ర‌నౌత్‌.  ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన కంగ‌న బాలీవుడ్ న‌టీన‌టుల‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఒక్కొక్క‌రి బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌ని, ఒక్కొక్క‌రి రాస‌లీల‌లు బ‌య‌ట‌పెడ‌తాన‌ని కంగ‌న ర‌నౌత్  తీవ్రస్థాయిలో విరుచుకుప‌డింది. `మ‌ణిక‌ర్ణిక‌` చిత్రాన్ని, కంగ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ను బాలీవుడ్‌కు సంబంధించిన ఏ న‌టీన‌టులు ప్ర‌శంసించ‌లేదు.  స‌మంతా, త‌మ‌న్నా త‌ప్ప ఏ సెల‌బ్రిటీ కంగ‌న గురించి కానీ, `మ‌ణిక‌ర్ణిక‌` విజ‌యం గురించి కానీ మాట్లాడ‌లేదు. 

ఇదే కంగ‌న‌కు వెర్రెత్తించేలా చేసింద‌ట‌. దీంతో బాలీవుడ్‌పై కంగ‌న శివాలెత్తుతోంద‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే త‌న‌పై కొంత మంది ప‌నిగ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్నార‌ని వారంద‌రికి త్వ‌ర‌లోనే చుక్క‌లు చూపిస్తాన‌ని కంగ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం బాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.  `నా సినిమా ప్ర‌చారం కోసం వేరే సెల‌బ్రిటీలు రావాల్సిన అవ‌స‌రం ఏముంది?. అందువ‌ల్ల నాకు క‌లిగే లాభం ఏమిటో నాకు అర్థం కావ‌డం లేదు. న‌టిగా ఇప్ప‌టికే నాలుగు జాతీయ పుర‌స్కారాల్ని సొంతం చేసుకున్నాను. 31 ఏళ్ల‌కే ద‌ర్ఠ‌వ‌కురాలిగా నా స‌త్తా ఏంటో నిరూపించుకున్నాను. ఎవ‌రి సినిమాల‌కు వారు ప్ర‌చారం చేసుకుంటే చాలు. మిగ‌తా వారి సినిమాలో వేలు పెట్ట‌కుంటేనే మంచిది. ఝాన్సీ ల‌క్ష్మీబాయ్‌కి నేను ఎంతో మిగ‌తా వారూ అంతే.  ఆమె నాకు చుట్ట‌ము కాదు. ప‌క్క‌మూ కాదు. 

 క్లాస్ రూమ్‌లో వున్న ప‌దిమందిలో ఒక‌రు నిజాలు మాట్లాడితే మిగ‌తా వారంతా ఎలా చెబుతావు అలా అని టార్గెట్ చేయాల‌ని చూస్తుంటారు. బాలీవుడ్ ఇప్పుడు అలాగే త‌యారైంది. ఇక నుంచి నేను వారిలో ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌ను. వెంట‌ప‌డి మ‌రీ వారి అంతుచూస్తాను. ఒక్కొక్క‌రి జీవితాల్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తా కాసుకొండి ఇక అంటూ వార్నింగ్ ఇవ్వ‌డం కంగ‌న‌ను వ్య‌తిరేకిస్తున్న వారిలో వ‌ణుకుపుట్టిస్తోంది. 

Sponsored links

kangana warnig to bollywood celebs:

kangana fires on bollywood celebs

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019