Advertisementt

ఈ2మ‌న‌సులు టీజ‌ర్ వదిలారు

Mon 28th Jan 2019 01:20 PM
ee2manasulu,movie,teaser,launch,details  ఈ2మ‌న‌సులు టీజ‌ర్ వదిలారు
Ee2 Manasulu Movie Teaser Launch ఈ2మ‌న‌సులు టీజ‌ర్ వదిలారు
Advertisement
Ads by CJ

శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై చంద్ర‌శేఖ‌ర్ ఎస్‌.నిర్మించిన చిత్రం ఈ 2మ‌న‌సులు. ఆది పినిశెట్టి ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రం ల‌వ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెర‌కెక్కుతుంది. ర‌విచంద్ర‌, సుమ‌య క‌థానాయ‌కులుగా ప‌రిచ‌మ‌వుతున్నారు. ఈ చిత్ర  షూటింగ్ 70శాతం  పూర్తిచేసుకుంది. చివ‌రి షెడ్యూల్‌ ఫిబ్ర‌వ‌రిలో పూర్తి చేసుకుని స‌మ్మ‌ర్‌లో ఈ 2 మ‌న‌సులు కూల్‌గా మీ ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఫిలింఛాంబ‌ర్‌లో టీజ‌ర్ మ‌రియు సాంగ్‌ను విడుద‌ల చేశారు. విలేక‌రుల స‌మావేశంలో చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ... ఈ సినిమాలో నాత‌మ్ముడు స‌త్య నాకు చాలా హెల్ప్ చేశారు. స్ర్కిప్ట్ విష‌యంలో చాలా స‌పోర్ట్ చేశారు. మ‌మ్మ‌ల్ని న‌మ్మి మాకు ఈ అవ‌కాశం ఇచ్చిన మా ప్రొడ్యూస‌ర్‌ గారికి మేము రుణ‌ప‌డి ఉంటాము. ఇది ఒక ల‌వ్ స్టోరీ. మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అన్నారు.

ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు అంద‌రూ కొత్త‌వాళ్ళు అయినా కూడా సినిమా చాలా బాగా వ‌చ్చింది. స్టోరీ రెడీ అయ్యాక మేం చాలా మంది పెద్ద హీరోల వ‌ద్ద‌కు  వెళ్ళి అడిగితే ఎవ్వ‌రూ మాకు డేట్స్ ఇవ్వ‌లేదు. అంద‌రూ బ్యాన‌ర్ ఏంటి, సినిమా వ‌స్త‌దా లేదా అని అడుగుతున్నారు. దీంతో అంద‌రూ కొత్త‌వాళ్ళ‌నే తీసుకున్నాం. ఎప్ప‌టికైనా ఇది చాలా పెద్ద బ్యాన‌ర్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. మాలాంటి చిన్న ప్రొడ్యూస‌ర్ల‌ను ఎంక‌రేజ్ చేస్తేనే మంచి క‌థ‌ల‌తో మీ ముందుకు రాగ‌ల‌ము అని అన్నారు.

హీరో మాట్లాడుతూ... ఈ మ‌ధ్య వ‌చ్చిన ల‌వ్‌స్టోరీస్ కి చాలా భిన్నంగా ఉంటుంది ఈ చిత్రం. త‌ప్ప‌కుండా మా సినిమాని అంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాం. నాకు మా డైరెక్ట‌ర్ గారు అంతా ద‌గ్గ‌రుండి చెప్పి చె యించుకున్నారు. మా నుంచి ఆయ‌న‌కు ఎటువంటి న‌ట‌న కావాలో అది ఆయ‌న రాబ‌ట్టుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను అన్నారు. 

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. ర‌విచంద్ర‌, సుమ‌య‌, రంగి, మ‌హేష్‌, కాందంబ‌రి కిర‌ణ్‌, తిరుప‌తి, జావెద్‌, స‌తీశ్‌, కిర‌ణ్‌, మౌనిక‌, జ‌న‌తాసురేష్‌, పూజానాయుడు న‌టించిన ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ : చంద్ర‌శేఖ‌ర్ ఎస్‌, డైరెక్ట‌ర్ : ఆదిపినిశెట్టి, కెమెరామెన్ : నంద‌న్‌కృష్ణ‌, మ్యూజిక్‌ డైరెక్ట‌ర్ : జి.వి.ఎం.గౌత‌మ్‌, బ్యాన‌ర్ : శేఖ‌ర్ మూవీస్‌, ఎడిట‌ర్ : ఎన్‌.మ‌ల్లేశ్‌బాబు, ఆర్ట్‌డైరెక్ట‌ర్ : రామ్‌ర‌మేష్‌, లిరిక్‌ రైట‌ర్ : సాంబ అనిశెట్టి.

Ee2 Manasulu Movie Teaser Launch:

Ee2Manasulu Movie Teaser Launch details

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ