96 రీమేక్ సోల్ మిస్స‌వ‌ట్లేదుక‌ద‌!

Sun 27th Jan 2019 06:16 PM
96,96 telugu remake,dil raju,sharwanand,samantha,prem kumar,trisha,vijay sethupathi  96 రీమేక్ సోల్ మిస్స‌వ‌ట్లేదుక‌ద‌!
96 telugu remake missing the soul? 96 రీమేక్ సోల్ మిస్స‌వ‌ట్లేదుక‌ద‌!
Sponsored links

ఒక భాష‌లో క్లాసిక్‌గా నిలిచిన చిత్రాన్ని మ‌రో భాష‌లో పునఃసృష్టించ‌డం కొంత క‌ష్టంతో కూడుకున్న ప‌నే. 3 ఇడియ‌ట్స్ త‌మిళ, తెలుగు భాష‌ల్లో శంక‌ర్ ఎంతగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసినా ఆ సోల్‌ని మాత్రం యద‌త‌దంగా క్యారీ చేయ‌లేక‌పోయాడు. మాస్ మ‌సాలా సినిమాల‌కు మ‌రిన్ని హంగులు జోడించి రీమేక్‌లుగా తెర‌పైకి తీసుకొచ్చినంత ఈజీ కాదు ఫీల్ గుడ్ చిత్రాని మ‌క్కీటూ మ‌క్కీ దింపేయ‌డం. అందుకే నేమో దిల్ రాజు అండ్ కో `96`ని అలాగే తెలుగులో దించేయ‌కుండా తెలుగుకు మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట. అలా మార్పులు చేస్తూ త‌ప్పుచేస్తున్నారా? అంటే అత్య‌ధిక మెజారిటీ వ‌ర్గం నిజంగా త‌ప్పే చేస్తున్నార‌ని చెబుతున్నారు. 

త‌మిళంలో గ‌త ఏడాది సూప‌ర్‌హిట్‌గా నిలిచిన చిత్రం `96`. ఎక్స్‌పెక్ట్ చేయ‌ని జంట విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా త్రిషలోని అస‌లైన న‌టిని ప‌రిచ‌యం చేసింది. ఆమె కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన సినిమాగా నిలిచింది. 96 కాలంనాటి మేకింగ్‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌ర స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ సినిమాని తెలుగులో శ‌ర్వానంద్‌, స‌మంత‌ల క‌ల‌యిక‌లో దిల్ రాజు నిర్మించ‌బోతున్న విష‌యం తెలిసిందే. శ‌నివారం ఈ సినిమా విష‌యంలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు మార్పుల పేరుతో ఈ సినిమా సోల్‌ని చెడగొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  

 చెన్నైలో ఈ చిత్ర విడుద‌ల‌కు ముందే ప్ర‌త్యేకంగా చూసి సినిమా ఫ‌లితాన్ని అంచ‌నా వేసిన దిల్ రాజు తెలుగు రీమేక్ హ‌క్కుల్ని ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. మ‌న‌సుప‌డి రీమేక్ హ‌క్కుల్ని చేజిక్కించుకున్న ఆయ‌న చైలల్డ్ ఎనిసోడ్‌ని కాస్త త‌గ్గించి స్వ‌ల్ప మార్పుల‌తో రీమేక్ చేస్తే ఇక్క‌డ కూడా `96` బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డం ఖాయం. అయితే అలా చేయ‌కుండా అన‌వ‌స‌ర మార్పులు పోతే క్లాసిక్ లాంటి చిత్రాన్ని కిల్ చేసిన‌ట్టు అవుతుంది. 

Sponsored links

96 telugu remake missing the soul?:

96 telugu remake little bit changes?

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019