Advertisementt

శ‌ర్వానంద్‌, స‌మంత.. ఇవిగో డిటైల్!

Sat 26th Jan 2019 10:26 PM
sharwanand,samantha,96 movie,remake,details  శ‌ర్వానంద్‌, స‌మంత.. ఇవిగో డిటైల్!
Sharwanand and Samantha in 96 Remake శ‌ర్వానంద్‌, స‌మంత.. ఇవిగో డిటైల్!
Advertisement
Ads by CJ

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ కొత్త చిత్రం 

ప్రారంభం నుండి ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పు పొందేలా విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్.. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2.. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌’తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది. ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బ్యాన‌ర్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో 34వ చిత్రంగా రూపొంద‌నున్న చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మ‌ంత హీరో హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు. 

త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించి ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం ‘96’కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ‘96’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ‌కుమార్ తెలుగు రీమేక్‌ను కూడా తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చి నుండి సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Sharwanand and Samantha in 96 Remake:

96 Remake Movie Details

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ