ర‌ష్మిక ట్రెడిష‌న‌ల్ ట్రీట్‌ మామూలుగా లేదుగా!

Fri 25th Jan 2019 11:37 PM
rashmika,rashmika mandanna,dear comrade,traditional look,geetha govindam,  ర‌ష్మిక ట్రెడిష‌న‌ల్ ట్రీట్‌ మామూలుగా లేదుగా!
rashmika traditional treat ర‌ష్మిక ట్రెడిష‌న‌ల్ ట్రీట్‌ మామూలుగా లేదుగా!
Sponsored links

క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న‌.  నాగ‌శౌర్య న‌టించి `ఛ‌లో` సినిమాతో తెలుగు నాట అడుగుపెట్టిన ఈ క‌న్న‌డ సోయ‌గం తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న ర‌ష్మిక జోరుని విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన `గీత గోవిందం` మ‌రింత పెంచేసిన విష‌యం తెలిసిందే. నానితో క‌లిసి చేసిన `దేవ‌దాస్‌` త‌న వేగానికి స్పీడు బ్రేకర్‌గా మారినా మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ `డియ‌ర్ కామ్రేడ్‌` రూపంలో మ‌రో సినిమాకి ఛాన్సిచ్చాడు. 

కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందిస్తున్న `డియ‌ర్ కామ్రేడ్‌` నిర్మాణం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా త‌రువాత `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వ‌లో నితిన్ హీరోగా తెర‌పైకి రాబోతున్న `భీష్మ‌`లోనూ ర‌ష్మిక‌ న‌టిస్తోంది. క‌న్ప‌డంలో `పొగ‌రు`, య‌జ‌మాన వంటి చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వుంది. వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ ఎంత బిజీగా వున్నా సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా వుంటోంది. తెర‌పైనా, సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లోనూ యుత‌ను మెస్మ‌రైజ్ చేస్తూ త‌న మ‌త్తులో ప‌డేస్తున్న ఈ క‌న్న‌డ చిన్న‌ది కొత్త‌గా మ‌రో ఆక‌ర్ష‌ణ మంత్రాన్ని మొద‌లుపెట్టింది. 

తెలుగు ఆడియ‌న్స్‌ని, తెలుగు ఫాలోవ‌ర్స్‌ని మ‌రింత మందిని బుట్ట‌లో  వేయ‌డం కోసం ఏకంగా ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయిగా లంగా ఓణీలో రెడీ అయిపోయింది. ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో ఫొటోల‌కు పోజులిచ్చిన ర‌ష్మిక వాటిని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. లంగా ఓణీ వేసుకుని ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మెరిపోతున్న ర‌ష్మిక‌ని చూసిన అభిమానులు గార్జియ‌స్ బ్యూటీ అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

Sponsored links

rashmika traditional treat:

rashmika traditional treat for fans

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019