ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> sonu sood reveals behaind truth of manikarnik

సోనూసూద్‌కు ఇప్పుడు జ్ఞానోద‌య‌మైంది!

sonu sood reveals behaind truth of manikarniksonu sood reveals behaind truth of manikarnik

ఆవేశంగా అనాలోచిత నిర్ణ‌యాలు తీసుకుంటే త‌రువాత బాధ‌ప‌డ‌టం త‌ప్ప చేసేదేమీవుండ‌దు. ఆ విష‌యం సోనూసూద్ వ‌ల్ల మ‌రోసారి నిజమ‌ని తేలింది. తెలుగు, త‌మిళ భాష‌ల‌తో పాటు సోనూసూద్‌కు బాలీవుడ్‌లోనూ మంచి పేరున్న విష‌యం తెలిసిందే. అదే పేరు అత‌నికి చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో రూపొందుతున్న `మ‌ణిక‌ర్ణిక‌: ద‌ క్వీన్ ఆఫ్ ఝాన్సీ`లో న‌టించే అరుదైన అవ‌కాశాన్ని అందించింది. అయితే ఆ అవ‌కాశాన్ని త‌న అనాలోచిత నిర్ణ‌యంతో వ‌దుకోవాల్సి వ‌చ్చింద‌ని ఇప్పుడు ఫీల‌వుతున్నాడు. కంగ‌న ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని క్రిష్ మొద‌లుపెట్టి చివ‌ర‌లో వ‌దిలేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ బాధ్య‌త‌ల్ని కంగ‌న ర‌నౌత్ తీసుకుని సినిమాను పూర్తి చేయాల‌ని పూనుకుంది.

కంగ‌న డైరెక్ష‌న్‌లో నేను న‌టించ‌డం ఏంటి? అని ఫీలైన సోనూ ఈ సినిమా నుంచి అర్థాంత‌రంగా తప్పుకున్నాడు. త‌న స్థానంలో మ‌రో న‌టుడిని తీసుకుని అప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించిన సోనూసూద్ వెర్ష‌న్‌ని ప‌క్క‌న పెట్టి కంగ‌న మ‌ళ్లీ షూట్ చేసింది. అన్ని అవాంత‌రాల‌ను దాటి `మ‌ణిక‌ర్ణిక‌: ద‌ క్వీన్ ఆఫ్ ఝాన్సీ`ఈ శుక్ర‌వారం విడుద‌ల‌వుతోంది. ఈ విష‌యం తెలిసి త‌న అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల త‌ను కోరుకున్న‌ సినిమా నుంచి అర్థాంత‌రంగా బ‌య‌టికి వ‌చ్చాన‌ని ఇప్పుడు ఫీల‌వుతున్న‌ సోనూసూద్‌ బృందంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 

ఈ సినిమా కోసం ప్ర‌తీ ఒక్క‌రూ చాలా శ్ర‌మించార‌ని, ఇలాంటి సినిమాలో నేను లేనందుకు ఆ బాధ న‌న్ను ఎప్ప‌టికీ వెంటాడుతూనే వుంటుంద‌ని ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. `నేను కంగ‌న వ‌ల్ల ఈ సినిమా వ‌దులుకున్నాన‌ని జ‌రిగిన ప్ర‌చారంలో నిజం లేద‌ని, రోహిత్ షెట్టి `సింబా` కార‌ణంగానే `మ‌ణిక‌ర్ణిక‌` చిత్రాన్ని వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని వెల్ల‌డించాడు. ఈ సినిమా టీమ్ అంద‌రికి ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని, వారి క‌ష్టానికి త‌గ్గ‌ట్టుగా `మ‌ణిక‌ర్ణిక‌` భారీ విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేయ‌డం విశేషం. 

sonu sood realised

manikarnika
sonu sood
kangana ranaut
krish
krsih jagarlamudi
manikarnika: the queen of jhansi