Advertisement

ఎన్టీఆర్ రిజల్ట్‌తో నాగ్ డెసిషన్‌లో మార్పు!

Fri 25th Jan 2019 10:53 PM
anr biopic,nagarjuna,ntr biopic,kathanayakudu  ఎన్టీఆర్ రిజల్ట్‌తో నాగ్ డెసిషన్‌లో మార్పు!
Big Change in Nag Mind Set ఎన్టీఆర్ రిజల్ట్‌తో నాగ్ డెసిషన్‌లో మార్పు!
Advertisement

బాలకృష్ణ తన తండ్రి బయోపిక్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఎన్టీఆర్ బయోపిక్‌ని కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా విభజించి కథానాయకుడిని ప్రేక్షకుల ముందుకు తెచ్చేసాడు. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకి పాజిటివ్ టాక్ రావడమే కాదు... మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. కానీ సినిమాకి అనుకున్న కలెక్షన్స్ రాలేదు. కథానాయకుడు కొన్న బయ్యర్లు బావురమనే కలెక్షన్స్ కథానాయకుడికి వచ్చాయి. అంటే మూడొంతుల లాస్ కథానాయకుడు నిర్మాతలకు తెచ్చిపెట్టింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా సెట్స్ మీదకెళ్లాక నాగార్జున తన తండ్రి ఏఎన్నార్ బయోపిక్ మీద ఇంట్రెస్ట్ చూపినట్లుగా వార్తలొచ్చాయి. 

కానీ నాగార్జున ఏఎన్నార్ నట జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు, కాంట్రవర్సీలు లేవు కాబట్టి బయోపిక్ తీస్తే వర్కౌట్ అవ్వదని నాగార్జున ఏఎన్నార్ బయోపిక్ లేదని చెప్పేసాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడికి మొదటిరోజు వచ్చిన రెస్పాన్స్ చూసి నాగ్ ఫ్యామిలీ ఏఎన్నార్ బయోపిక్ మీద ఆసక్తి చూపుతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎలాంటి కాంట్రవర్సీ అంటే ఎన్టీఆర్ నట జీవితం క్లీన్ అండ్ నీట్ గా సినిమాలో చూపెట్టినా.. సినిమా బావుంది అనడంతో నాగ్ ఫ్యామిలీ కూడా అక్కినేని బయోపిక్ విషయంలో పునరాలోచన చేస్తున్నారని అన్నారు.

కానీ కథానాయకుడు కలెక్షన్స్ చూసి నాగార్జున భయపడ్డాడు. కథానాయకుడు టాక్ బావున్నప్పటికీ.. ఆ సినిమాలో ఎమోషన్స్‌కి, ట్విస్ట్‌లకు చోటు లేకపోవడంతో.. ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే కథానాయకుడు హిట్ టాక్‌తో పునరాలోచించిన నాగార్జున.. ఇప్పుడు కథానాయకుడికి వచ్చిన కలెక్షన్స్.. ఆ సినిమాపై వచ్చిన నెగెటివిటీకి నాగార్జున బాగా భయపడినట్లుగా అనిపిస్తుంది. తన కొడుకు అఖిల్ మిస్టర్ మజ్ను ఇంటర్వూస్ లో భాగంగా ఏఎన్నార్ బయోపిక్ ఉండదని.. నాన్నగారి జీవితం తెరిచిన పుస్తకమని.. ఇంకా దాని గురించి ప్రేక్షకులకు తెలియాల్సి ఏమిలేదని.... అందుకే భవిష్యత్తులో కూడా ఏఎన్నార్ బయోపిక్ తియ్యబోమని స్పష్టం చేసాడు.

Big Change in Nag Mind Set:

Nag Decision on ANR Biopic

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement