Advertisementt

హీరో మార్కెట్‌ని మించి ఖ‌ర్చుపెట్టేస్తున్నారు?

Fri 25th Jan 2019 12:01 AM
gopichand,anil sunkara,ak entertainments,thiru,abhishek agarwal,sunkara ramabrahmam  హీరో మార్కెట్‌ని మించి ఖ‌ర్చుపెట్టేస్తున్నారు?
anil sunkara spending over budget హీరో మార్కెట్‌ని మించి ఖ‌ర్చుపెట్టేస్తున్నారు?
Advertisement
Ads by CJ

హీరో మార్కెట్‌ని మించి ఖ‌ర్చు చేయ‌డం ఆ త‌రువాత చేతులు కాల్చుకోవ‌డం కొంత మంది నిర్మాత‌ల‌కు ప‌రిపాటిగా మారింది. ఇటీవ‌ల క్రేజీ కాంబినేష‌న్‌తో నేపాల్ నేప‌థ్యంలో ప్రేమ‌క‌థా చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్న నిర్మాతని చూసిన కూడా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంక‌ర జాగ్ర‌త్త ప‌డ‌టం లేదు. `ఇటీవ‌ల `కిరాక్ పార్టీ` చిత్రంతో న‌ష్టాల్ని చ‌విచూసిన ఆయ‌న మ‌రోసారి అదే త‌ప్పుచేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. అభిషేక్ అగ‌ర్వాల్‌తో క‌లిసి స‌హ‌నిర్మాత‌గా (పేరుకే) వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ సినిమా ఇటీవ‌ల ఇండియా- పాకిస్థాన్ బోర్డ‌ర్‌లోని జైస‌ల్మేర్‌లో మొద‌లైంది. 

గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. యాభై రోజుల పాటు జ‌రిగే తాజా షెడ్యూల్‌లో రాజ‌స్థాన్ , న్యూ ఢిల్లీలోని కీల‌క ప్రాంతాల్లో మెజ‌ర్ సీన్‌ల‌ని చిత్రీక‌రిస్తార‌ట‌. వ‌రుస ఫ్లాపుల‌తో బెంబేలెత్తిపోతున్న గోపీచంద్ కోసం ఏకంగా 35 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గోపీచంద్ మార్కెట్ గ‌త కొంత కాలంగా డ‌ల్‌గా వుంది. దానికి తోడు ఆయ‌న‌కు అంత మార్కెట్ కూడా లేదు. ఏ ధైర్యంతో 35 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. 

సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేసిన‌ `గౌత‌మ్‌నంద‌` కోసం భ‌గ‌వాన్‌, పుల్లార‌వు 32 కోట్లు ఖ‌ర్చు చేశారు. భారీ స్థాయిలో న‌ష్ట‌పోయారు. ఆ సినిమా దెబ్బ‌తో మ‌ళ్లీ సినిమా చేయ‌లేదు. ఇంత తెలిసీ అనిల్ సుంక‌ర ఏ ధైర్యంతో ఈ సినిమా చేస్తున్నాడ‌ని చాలా మంది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆరాతీస్తున్నార‌ట‌. అయితే ఇన్న‌ర్ టాక్ మాత్రం క‌థ డిమాండ్ మేర‌కు బ‌డ్జెట్ పెడుతున్నార‌ని వినిపిస్తోంది. ఎంత క‌థ డిమాండ్ చేసినా పెట్టిన పెట్టుబ‌డి తిరిగిరావాలి క‌దా అన్న‌ది మ‌రికొంద‌రి వాద‌న‌.

anil sunkara spending over budget:

gopichand new film budget 35 crores

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ