Advertisement

ఈ ‘మజ్ను’కు అన్ని శకునాలు బాగున్నాయ్

Wed 23rd Jan 2019 11:23 AM
akhil akkineni,mr majnu,release,ready  ఈ ‘మజ్ను’కు అన్ని శకునాలు బాగున్నాయ్
Positive Vibes on Mr Majnu ఈ ‘మజ్ను’కు అన్ని శకునాలు బాగున్నాయ్
Advertisement

ఏ హీరో చిత్రమైనా విడుదలవుతోందంటే కథ ఇది, ఆ చిత్రం నుంచి కాపీ కొట్టారు... బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల మూలాలను తీసుకున్నారని సోషల్‌మీడియా హోరెత్తుతోంది. పలు సార్లు ఇది నిజమని కూడా రుజువైంది. అయినా పూర్తి విభిన్నమైన చిత్రాలు ఎప్పుడో గానీ రావు. పాత చిత్రాలు, నవలలు, కథ, కథానికలు, రామాయణం, మహాభారతం వంటి వాటి నుంచే మూలాలు, క్యారెక్టరైజేషన్స్‌ ఉంటాయి. పాత కథే అయినా పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లేతో ముందుకు వెళ్లి, క్యారెక్టరైజేషన్స్‌లో మనల్ని మనం చూసుకునేలా చేయగలిగే చిత్రాలకు ఎప్పుడు ఢోకా ఉండదు. 

ఇక ఇటీవల విడుదలైన అక్కినేని అఖిల్‌ మూడో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’ ట్రైలర్‌ విడుదలైన తర్వాత ఇది ‘ఆరెంజ్‌’ చిత్రంలోని హీరో క్యారెక్టరైజేషన్‌నే పోలి ఉందనే ప్రచారం సాగుతోంది. కానీ ఇలాంటి విషయాలలో కేవలం ట్రైలర్‌ని చూసి ఓ నిర్ణయానికి రావడం తప్పు. హీరో క్యారెక్టర్‌ని ప్రేరణగా తీసుకుని ఫ్లాపయిన చిత్రాల మూలాలతో వచ్చిన ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ‘తొలిప్రేమ’ చిత్రం చూసిన తర్వాత వెంకీ అట్లూరిలో ఆ ప్రతిభ ఉందని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అదే చిత్రాన్ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాదే ఎంతో నమ్మకంతో దీనిని కూడా నిర్మించాడు. ‘తొలిప్రేమ’ విడుదల సమయంలో ఏదో వరుణ్‌తేజ్‌కి ఉన్న అభిమానులు తప్ప సామాన్యమైన ప్రేక్షకులు ఏమీ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. అలా లోప్రోఫైల్‌లో రావడమే ఆ మూవీకి ప్లస్‌ అయింది. అలాగే అఖిల్‌ నటించిన రెండు చిత్రాలు ‘అఖిల్‌, హలో’లతో పోలిస్తే ‘మిస్టర్‌ మజ్ను’పై కూడా పెద్దగా అంచనాలు లేకపోవడం కలిసోచ్చే అంశమే అవుతుంది. 

ఇంకోవైపు ఈ చిత్రానికి కట్స్‌ ఏమీ లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ లభించింది. తాజాగా విడుదల చేసిన సాంగ్‌ ప్రోమోలు అఖిల్‌ అద్భుతంగా, స్ప్రింగ్‌లు మింగాడా? అనే తరహాలో నేటి యంగ్‌స్టార్స్‌కి ధీటుగా స్టెప్సు వేస్తూ కనిపించాడు. నిజానికి అఖిల్‌ మొదటి రెండు చిత్రాలు సరిగా ఆడి ఉండకపోవచ్చు గానీ అఖిల్‌కి మాత్రం ఎవ్వరూ వంకపెట్టలేదు. తాజాగా ఎన్టీఆర్‌ సైతం ‘అఖిల్‌’లో ఎంత మంచి నటుడు ఉన్నాడో నమ్మకంగా చెప్పాడు. 

ఇక అక్కినేని ఫ్యామిలీకి కలసి వచ్చిన ప్లేబోయ్‌ తరహా పాత్రలో అఖిల్‌ కనిపించనున్నాడు. ఏయన్నార్‌, నాగార్జునలకు కూడా ఇలాంటి సినిమాలు అద్భుతమైన విజయాలను అందించాయి. ఇక తాతయ్య లైలా మజ్నుతో పెద్ద హిట్‌ కొట్టాడు. నాగార్జున-రజనీ కాంబినేషన్‌లో వచ్చిన దాసరి ‘మజ్ను’ కూడా బాగా ఆడింది. మరి తాతయ్య, తండ్రులలానే మనవడు అఖిల్‌కి ఈ జోనర్‌ మొదటి సక్సెన్‌ను ఇస్తుందో లేదో వేచిచూడాల్సివుంది..! 

Positive Vibes on Mr Majnu:

Mr Majnu Movie Ready to Release 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement