వర్మ, శ్రీరెడ్డి.. మళ్లీ ఎంటరైయ్యారు!

Fri 11th Jan 2019 06:37 PM
sri reddy,mega family,ram gopal varma,pawan kalyan,balakrishna,nagababu,counter  వర్మ, శ్రీరెడ్డి.. మళ్లీ ఎంటరైయ్యారు!
RGV and Srireddy Counter Attack on Nagababu వర్మ, శ్రీరెడ్డి.. మళ్లీ ఎంటరైయ్యారు!
Sponsored links

నాగబాబు వరుసగా బాలకృష్ణపై కామెంట్స్‌, సెటైర్లు, వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడు. బాలకృష్ణ అంటే అలనాటి కమెడియన్‌ బాలకృష్ణ అని అర్దం వచ్చేలా గతంలో చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా కౌంటర్లు వేస్తున్నాడు. అయినా ఇండస్ట్రీలో తనకు ఎంతో మంచి స్నేహితుడు చిరంజీవేనని ఎన్నోసార్లు బాలయ్య చెప్పాడు. అభిమానులు, క్రేజ్‌, సినీ కెరీర్‌, పొలిటికల్‌గా వీరిద్దరి మధ్య పోటీ ఉండి ఉండవచ్చు. కానీ బాలయ్య అంటే చిరుకి కూడా అభిమానమే. అందునా ఇప్పుడే అందరు హీరోలు స్నేహితంగా మెలుగుతున్నారు. 

ప్రస్తుతం మెగాఫ్యామిలీకి చెందిన రామ్‌చరణ్‌-నందమూరి వంశానికి చెందిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌లు ఎంతో స్పోర్టివ్‌గా రాజమౌళి దర్శకత్వంలో నిజమైన మల్టీస్టారర్‌ చేస్తున్నారు. అందునా ఎన్నికలు, బాలయ్య ఎన్టీఆర్‌ బయోపిక్‌ సమయంలో పాత వాటిని నేడు నాగబాబు తోడుతుండటం బాధాకరం. ఏదైనా ఉంటే బాలయ్య ఆ మాటలు అన్న వెంటనే సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ నాగబాబు వేస్తున్న కౌంటర్లు సమయం సందర్భాలు లేకుండా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఇది మరోసారి ఇరువురి అభిమానుల మధ్య తీవ్రమైన ఉద్రిక్తలకు కారణంగా మారింది. 

ఇదే సమయంలో ఇందులోకి వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వర్మ బాలయ్య, చంద్రబాబులను టార్గెట్‌ చేస్తూ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం తీస్తూ ఉండటంతో పబ్లిసిటీ కోసమే ఆయన ఈ ఎత్తుగడ వేసి రామాయణంలో పిడకల వేట అని నిరూపించుకున్నాడు. ఇక తెలుగులో కాస్టింగ్‌కౌచ్‌ ఉద్యమానికి తెరలేపిన శ్రీరెడ్డి తాజాగా రామాయణంలో పిడకల వేట-2ని ప్రారంభించి, సందట్లో సడేమియా అనిపిస్తోంది. 

ఈమె తాజాగా పవన్‌ అంటే ఎవరు? పవన్‌ ఎవరో నాకు తెలియదు? ఆయన ఓ పెయింటర్‌. ఆయన గురించి యూట్యూబ్‌లో కూడా ఉంది. కొంతమంది నాతో పవన్‌ గురించి మాట్లాడమంటున్నారు. పవన్‌ అంటే దొంగ చూపులు చూస్తూ, దొంగ కోళ్లు పట్టేవాడిలా ఉంటాడని తెలుసు. చదువు రాక కొందరు మహానుభావుల పేర్లను కూడా తప్పుగా చెప్పాడు. పైగా లక్షల పుస్తకాలు చదివానని అబద్దాలు చెబుతూ ఉంటాడు. పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ దేశసేవ చేస్తున్నానని అంటూ ఉంటాడు. చిన్నపిల్లలను వెంటేసుకుని తానో హీరోగా ఫోజులు కొడుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి చంద్రబాబు, జగన్‌ల మీద ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. మీ అన్నయ్య రాకముందు నుంచే జగన్‌ రాజకీయాలలో ఉన్నాడు. ఆయన అభిమానులు తల్చుకుంటే మీరెక్కడ ఉంటారో ఊహించుకోండి. సీఎం అవుతానని ప్రచారం చేసుకుంటూ అవివేకంగా తిరిగే వ్యక్తి ఆయన అని కామెంట్స్‌ చేసింది. 

తాజాగా ఆమె మరోసారి తేనెతుట్టెను కదిపింది. చిరు-పవన్‌లను బాలయ్య ఏదో అన్నాడని మీరు తెగ గగ్గోలు పెడుతున్నారే మరి గతంలో మీ తమ్ముడు కాంగ్రెస్‌ నాయకులు పంచెలూడదీసి పరుగెత్తిస్తానన్నాడు. జగన్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. దీనిపై మీ సమాధానం ఏమిటి? అంటూ నాగబాబుకి కౌంటర్‌ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరికి సంబంధించినది ఫిల్మ్‌ఛాంబర్‌. మరి పవన్‌ కళ్యాణ్‌ ఎవరండీ లోపలికి వెళ్లి తలుపులు వేసుకునేందుకు? ఆయన ఏ అర్హతతో లోనికి వెళ్లాడో చెప్పండి? ఇండస్ట్రీలో మీ దందాకి బాలకృష్ణ ఎప్పుడైనా అడ్డం వచ్చారా? పవన్‌కి విలువ ఇచ్చి పవన్‌ ఎవరో నాకు తెలియదు అని సింపుల్‌గా, గౌరవంగా బాలయ్య సమాధానం ఇచ్చాడు. అదే మరెవ్వరైనా అయితే ఘాటుగా స్పందించేవారు. 

బాలయ్యని అనేంత స్థాయి మీకులేదు. ఏదో వరుసగా వీడియోలు విడుదల చేసినంత మాత్రాన బాలయ్య భయపడుతారని అనుకుంటున్నారా? బాలయ్య- ఆయన అభిమానులు సైలెంట్‌గా ఉన్నారంటే అది మీ లక్కు. వారంతా మిమ్మల్ని క్షమిస్తున్నారు. జబర్దస్త్‌లో సోది కామెడీకి తెగ నవ్వే నువ్వు ఇప్పుడు గౌరవం, అదీ ఇదీ మాట్లాడుతున్నారు? అంటూ నాగబాబుపై విరుచుకుపడింది. 

మరోవైపు బాలయ్య గతంలో ఆడవారి గురించి చేసిన తప్పుడు వ్యాఖ్యలకు కౌంటర్‌గా నాగబాబు తానే నటించిన ‘ఎర్రోడి వీరగాథ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ని తన యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసి మరో సంచలనానికి తెరతీశాడు. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచిచూడాల్సివుంది...!

Sponsored links

RGV and Srireddy Counter Attack on Nagababu:

Sri Reddy Sensational Comments on Mega Family

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019