‘దేవ్’ విడుదల తేదీ ప్రకటించారు

Fri 11th Jan 2019 03:54 AM
karthi,rakul preet singh,dev movie,release,feb 14  ‘దేవ్’ విడుదల తేదీ ప్రకటించారు
Karthi DEV Release Date Fixed ‘దేవ్’ విడుదల తేదీ ప్రకటించారు
Sponsored links
జ‌న‌వ‌రి 14న కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ ఆడియో.. ఫిబ్రవ‌రి 14న సినిమా విడుద‌ల‌.. 
కార్తి హీరోగా న‌టిస్తున్న దేవ్ సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్రవ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్. ఈ సంద‌ర్భంగా చిత్ర ఆడియో విడుద‌ల తేదీని కూడా క‌న్ఫర్మ్ చేసారు ద‌ర్శక నిర్మాత‌లు. జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో విడుద‌ల కానుంది. హ‌రీష్ జ‌య‌రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. దేవ్ ఫ‌స్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను ర‌జ‌త్ ర‌విశంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఖాకీ లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత కార్తి స‌ర‌స‌న రెండోసారి ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, ర‌మ్యకృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. నిక్కీ గల్రానీ ‘దేవ్’ చిత్రంలో రెండో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. 
Sponsored links

Karthi DEV Release Date Fixed:

DEV Movie Release on FEB 14

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019