‘మహానటి’లో ఉండి, ‘ఎన్టీఆర్’లో మిస్సయిందిదే!

Thu 10th Jan 2019 08:32 PM
ntr biopic,mahanati,ntr kathanayakudu,savitri,keerthi suresh,ntr,balakrishna  ‘మహానటి’లో ఉండి, ‘ఎన్టీఆర్’లో మిస్సయిందిదే!
NTR Kathanayakudu Missed That Elements ‘మహానటి’లో ఉండి, ‘ఎన్టీఆర్’లో మిస్సయిందిదే!
Sponsored links

టాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు మాములుగా రాలేదు. గత ఏడాది చాలా తక్కువ బడ్జెట్ తోనే నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ మహానటిని అందరూ మెచ్చేలా తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇక ఈ ఏడాది బాలయ్య - క్రిష్ లు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడితో కథం తొక్కుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌ని ఒక భాగంగా చూపించలేక కథానాయకుడు, మహానాయకుడిగా తెరకెక్కించి ఒక నెల రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఇప్పటికే కథానాకుడు విడుదలై ప్రేక్షకుల మనస్సులను దోచేసింది. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంతో పాటుగా, నట జీవితాన్ని కథానాయకుడిలో చూపించారు.

అయితే మహానటిలో ఉన్న కామెడీ, ఎమోషన్, ఈ ఎన్టీఆర్ బయోపిక్‌లో పెద్దగా కనబడవు. ఎందుకంటే మహానటి లో సావిత్రి కథను జర్నలిస్టు లైన సమంత, విజయ్ దేవరకొండల మీద నడపడం.. సావిత్రి చిన్న నాటినుండి అల్లరిచిల్లరిగా. ఎవరి మాట వినని గడుసు అమ్మాయిగానే పెరిగింది. ఇక జెమిని గణేష్‌తో పెళ్లి, నటన, పిల్లలు, దుబారా ఖర్చు వలన అవసాన దశలో ఆమె పడిన వేదన ప్రతి ప్రేక్షకుడిని కంట తడి పెట్టించింది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎమోషన్ కి పెద్దగా చోటుండదు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వదిలి సినిమాల్లోకి రావడం.. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఆయన నట జీవితంలో పెద్దగా ఒడిదుడుకులు కనిపించవు. అలాగే ఎమోషన్ గా బలంగా హత్తుకునే సీన్స్ కూడా ఓ అన్నంత లేవు. ఇక మహానటిగా అంటే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది. కథానాయకుడులో బాలకృష్ణ.. ఎన్టీఆర్ గా నట విశ్వరూపం చూపించాడు. కానీ ఎన్టీఆర్ యంగ్ లుక్ లో బాలయ్య మాత్రం సరిగ్గా అతకలేదు.

బయోపిక్‌లు అంటే అంత కన్నా ఎక్కువ ఆశించలేము. ఎందుకంటే జీవిత చరిత్రగా తెరకెక్కిన సినిమాలో జీవితంలో జరిగినవి చూపిస్తారు కానీ... కామెడీని బలవంతంగా ఇరికించలేరు. ఇక ఎన్టీఆర్ నట జీవితం సాఫీగా సాగడంతోనే అందులో పెద్దగా ట్విస్టులు అవి కనబడవు. ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ మరణం అప్పుడు మాత్రం కాస్త ఎమోషన్ అవుతాడు ప్రేక్షకుడు. ఇక ఎక్కడా అంతగా ఎమోషన్స్ సీన్స్ కనబడలేదు. అలాగే కథానాయకుడిలో మెయిన్ మైనస్ గ్రిప్పింగ్ మిస్ కావడం.. స్లో నేరేషన్ అక్కడక్కడ అసహనం కలిగిస్తుంది. అదే సావిత్రి వ్యక్తిగత, నట జీవితాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ సమాంతరంగా మెయింటింగ్ చేసాడు. మహానటి స్క్రీన్‌ప్లే బావుంటుంది. కథానాయకుడిలో ఎక్కడా కాంట్రవర్సీలకు తావివ్వలేదు. అంటే నట జీవితం పరిపూర్ణం. మరి రేపు రాబోయే మహానాయకుడు ఎన్ని కాంట్రవర్సీలకు నెలవు అవుతుందో అనేది చూడాలి.

Sponsored links

NTR Kathanayakudu Missed That Elements :

These are missed in NTR Biopic

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019