బ్రేకింగ్‌: బిగ్‌బాస్ తెర‌పైకి ప‌వ‌న్ వైఫ్‌!

Tue 08th Jan 2019 09:29 AM
renu desai,bigg boss,bigg boss 3,bigg boss 3 contestants,pawan kalyan,nani,ntr,star maa,  బ్రేకింగ్‌: బిగ్‌బాస్ తెర‌పైకి ప‌వ‌న్ వైఫ్‌!
renu desai in bigg boss 3 బ్రేకింగ్‌: బిగ్‌బాస్ తెర‌పైకి ప‌వ‌న్ వైఫ్‌!
Sponsored links

బిగ్‌బాస్ సీజ‌న్ వ‌న్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వహ‌రిస్తే, బిగ్‌బాస్ సెకండ్ సీజ‌న్ వ్యాఖ్యాత‌గా నేచుర‌ల్ స్టార్ నాని ర‌క్తిక‌ట్టించాడు. ఇక మూడ‌వ సీజ‌న్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. దీనికి ఎవ‌రు వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిప్తార‌నే దానిపై కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ దఫా చిరంజీవి బిగ్‌బాస్ -3 వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం వుంద‌ని, లేదా ఆ స్థానంలో వెంక‌టేష్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌చారం జోరందుకుంది. అయితే తాజా వార్త‌ల స‌మాచారం ప్ర‌కారం ఈ సీజ‌న్‌కి బిగ్ బాస్‌గా ఓ స్టార్ హీరో కాకుండా ఓ హీరోయిన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. 

ఆమె మ‌రెవ‌రో కాదు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్‌. ఆమెని ఈ సీజ‌న్‌కి తీసుకొస్తే మ‌రింత క్రేజ్ వుంటుంద‌ని, నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. అయితే రేణుదేశాయ్ మూడ‌వ సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వుంటారా? లేక కంటెస్టెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న‌ది మాత్రం తెలియాల్సి వుంది. బ‌య‌టికి వ‌చ్చిన‌ బిగ్‌బాస్ -3 కంటెస్టెంట్‌ల వివ‌రాలు ఇలా వున్నాయి. యాంక‌ర్ ఉద‌య‌భాను, శోభిత దూళిపాల‌, గ‌ద్దె సింధూర‌, యూట్యూబ్ స్టార్ జాహ్న‌వి, వ‌రుణ్ సందేశ్‌, జాకీ, క‌మ‌ల్ కామ‌రాజు, హేమ‌చంద్ర‌, ర‌ఘు మాస్ట‌ర్ వంటి వారి పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముంద‌న్న‌ది నిర్వాహ‌కులు వెల్ల‌డించే వ‌ర‌కు స‌స్పెన్సే.  గ‌త సీజ‌న్‌లో ఎవ‌రు ముందుగా ఎలిమినేట్ అవుతున్నారో తెలిసిపోవడంతో ఈసారి అలా కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. 

Sponsored links

renu desai in bigg boss 3:

renu desai in bigg boss 3 contestant

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019