‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సెన్సార్ డిటైల్స్

Sun 06th Jan 2019 03:28 PM
ntr kathanayakudu,ntr biopic,balakrishna,censor details  ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సెన్సార్ డిటైల్స్
NTR Kathanayakudu Censor Details ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సెన్సార్ డిటైల్స్
Sponsored links

సెన్సార్ పూర్తిచేసుకుని ‘U’ సర్టిఫికేట్ తెచ్చుకున్న ‘ఎన్టీఆర్-కథానాయకుడు’.. జనవరి 9న గ్రాండ్ గా విడుదల

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ‘U’ సర్టిఫికేట్‌ని పొందింది. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా 2 గంటల యాభై నిమిషాల నిడివితో చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, సుమంత్, కళ్యాణ్ రామ్ తదితరులు చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్ 10 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో మంచి స్పందన దక్కించుకోగా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు. 

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం తదితరులు.

Sponsored links

NTR Kathanayakudu Censor Details:

U Certificate to NTR Kathanayakudu Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019