`బాహుబలి` సిరీస్ చిత్రాల తరువాత ప్రభాస్ స్టార్‌డమ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ఖండాంతర ఖ్యాతిని సొతం చేసుకున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతనితో కొత్త తరహా సినిమాల్ని హాలీవుడ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారడంతో అదే లెవెల్లో `సాహో` చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తరువాత `జిల్` ఫేమ్ రాధాకృష్ణతో ప్రభాస్ ఓ పిరియాడిక్ లవ్‌స్టోరీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా యువీనే నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా అంతా యూరప్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూరి్త కాకుండానే ప్రభాస్‌లో యువీ క్రియేషన్స్ భారీ ప్లాన్ వేసినట్లు తెలిసింది.
ఇటీవల కన్నడ స్టార్ యస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై వంద కోట్ల పై చిలుకు వసూళ్లను సాధించిన చిత్రం `కేజీఎఫ్`. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. `కేజీఎఫ్`ని ప్రశాంత్ నీల్ హాలీవుడ్ స్థాయి చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దిన తీరు యువీ క్రియేషన్స్ అధినేతలు ప్రమోద్, వంశీ కృష్ణారెడ్డిలకు విపరీతంగా నచ్చిందట. ప్రభాస్ హీరోగా అతనితో భారీ రేంజ్ సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని భావించి ప్రశాంత్ నీల్‌ని ఇటీవల కలిశారట. ప్రభాస్‌కు తగ్గ కథని సిద్ధం చేయమని చెప్పారని తెలిసింది. కథ ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ల కలయికలో సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.