Advertisement

‘మా’ ప‌థ‌కాలు అద్భుతం: మెగాస్టార్

Tue 01st Jan 2019 06:01 PM
maa,movie artists association,mega star chiranjeevi,new policies  ‘మా’ ప‌థ‌కాలు అద్భుతం: మెగాస్టార్
Chiranjeevi Praises Maa New policies ‘మా’ ప‌థ‌కాలు అద్భుతం: మెగాస్టార్
Advertisement

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఇటీవ‌లే కొత్త ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు మా అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శ‌కులు శివాజీ రాజా, సీనియ‌ర్ న‌రేష్ ఈ ప‌థ‌కాల వివ‌రాల్ని అందించారు. మా డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య నిర్మ‌ల, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు- శ్యామ‌లా దేవి దంప‌తులు ఈ ప‌థ‌కాల్ని ప్ర‌శంసించి త‌మ‌వంతు సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప‌థ‌కాల‌కు ప్ర‌త్యేకించి విడివిడిగా నామ‌క‌ర‌ణం చేసింది మా అసోసియేష‌న్. ఈ ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని, మూవీ ఆర్టిస్టుల సంఘం మంచి ప‌నులు చేసేందుకు ప్ర‌తిసారీ ముందుకొస్తోంద‌ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. మా అధ్య‌క్షుడు శివాజీరాజా, ఇత‌ర స‌భ్యుల కృషిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

2019 జ‌న‌వ‌రి -1 నుంచి ‘మా అసోసియేష‌న్‌’ త‌మ మెంబ‌ర్స్ కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల వివ‌రాలివి. ‘డా.చిరంజీవి మా క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం’ పేరుతో రూ.1,16,000 మొత్తాన్ని పెళ్లి చేసుకునే ఆడ‌పిల్ల‌కు అంద‌జేస్తారు. ‘డా.ఏఎన్నార్ మా విద్యా ప‌థ‌కం’ పేరుతో 80శాతం స్కోర్ చేసిన పిల్ల‌ల‌కు రూ.1,00,000 అంద‌జేస్తారు. ‘డా.విజ‌య‌నిర్మ‌ల మా చేయూత ప‌థ‌కం’ పేరుతో వృద్ధుల‌కు నెల‌వారీ ఫించ‌ను రూ.5000 చొప్పున అందిస్తారు. ఇదివ‌ర‌కూ రూ.2000గా ఉన్న ఫించ‌నును రూ.5000కు పెంచారు. 35 మంది స‌భ్యుల‌కు ఈ ఫించ‌ను అంద‌నుంది. ‘శ్రీ‌కాంత్ మా మాన‌వ‌తా ఎల్ఐసీ ప‌థ‌కం’ పేరుతో రూ.3,00,000 ఇన్సూరెన్స్ స‌దుపాయం మెంబ‌ర్స్‌కి క‌ల‌గ‌నుంది. ఇలాంటి ఉదాత్త‌మైన‌ ప‌థ‌కాలు భార‌త‌దేశంలోనే వేరొక సినీప‌రిశ్రమ‌లో ఎక్క‌డా అమ‌లు చేయ‌లేదని పరిశ్రమ ప్రముఖులు ప్రశంసలు కురిపించడం విశేషం.

Chiranjeevi Praises Maa New policies:

Movie Artists Association New Policies

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement