Advertisementt


అగ్రిమెంట్‌‌తో రవితేజ దగ్గర ఇరుక్కుపోయారు

Thu 27th Dec 2018 03:37 PM
raviteja,agreement,mythri movie makers,amar akbar antony,theri,raviteja hero  అగ్రిమెంట్‌‌తో రవితేజ దగ్గర ఇరుక్కుపోయారు
Raviteja vs Producers అగ్రిమెంట్‌‌తో రవితేజ దగ్గర ఇరుక్కుపోయారు
Advertisement
Ads by CJ

 

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రవితేజ - శ్రీను వైట్ల “అమర్ అక్బర్ ఆంటొని” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. రవితేజ మార్కెట్‌కి మించి బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశారు మైత్రి వాళ్ళు. రిజల్ట్ చాలా దారుణంగా రావడంతో మైత్రి వారికి ఈసినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఈసినిమా షూటింగ్ టైంలోనే మైత్రి వాళ్ళు రవితేజతో మరో రెండు సినిమాలు చేయాలని అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం.

అయితే ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఇప్పుడు మైత్రి వాళ్ళు రవితేజతో మిగిలిన సినిమాలు చేయడానికి వెనక్కి తగ్గుతున్నారట. కానీ రవితేజ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని ఫిలింనగర్ సమాచారం. డీల్ ప్రకారం తనకు రెండు సినిమాల పారితోషికం ఇస్తే కానీ డీల్ నుండి బయటికి రాను అని రవి మొహం మీద చెప్పేశాడట.

నిజానికి రవి.. మైత్రితో  తమిళ సినిమా “తేరి”ను రీమేక్ చేయాలి. దానికి సంబంధించి ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ క‌థ కూడా సిద్ధం చేసాడు. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లట్లేదు. ఇప్పుడు ఆ సినిమా చేసే ప్రయత్నంలో ఆ సంస్థ లేదు. కానీ రవితేజ మాత్రం తనకి డబ్బులు ఇస్తేనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను అని అంటున్నాడట. మరి ఈ గొడవ ఎప్పుడు సాల్వ్ అవుతుందో చూడాలి.

Raviteja vs Producers:

Mythri Movie Makers Faces Problems with Raviteja

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ