Advertisement

‘కథానాయకుడు’ ప్లస్, మైనస్ మాట్లాడుకుందాం?

Thu 27th Dec 2018 02:16 PM
balakrishna,ntr kathanayakudu,latest,update  ‘కథానాయకుడు’ ప్లస్, మైనస్ మాట్లాడుకుందాం?
NTR Kathanayakudu Movie Plus and Minus Points ‘కథానాయకుడు’ ప్లస్, మైనస్ మాట్లాడుకుందాం?
Advertisement

ప్రస్తుతం అందరి దృష్టి స్వర్గీయ ఎన్టీఆర్‌కి బయోపిక్‌గా రూపొందుతున్న బాలయ్య-క్రిష్‌ల ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’, రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లపై నిలిచి ఉంది. ఇక ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని పక్కనపెడితే జనవరి 9వ తేదీన విడుదల కానున్న ‘కథానాయకుడు’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఈ చిత్రం నిజమైన ఎన్టీఆర్‌ జీవితంలోని వాస్తవాలను విస్మరించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఈ మూవీలో నాటి ఎన్టీఆర్‌ నటించిన పాటల రీమిక్స్‌లు, నాటి ఎన్టీఆర్‌ వేసిన గెటప్‌లను బాలయ్య వేయడంపైనే ఎక్కువగా ప్రమోషన్స్‌ సాగుతుండటం కాస్త నిరుత్సాహపరిచే అంశమే. ఎందుకంటే నాటి గెటప్‌లు, పాటల రీమిక్స్‌లు చూడటానికి నందమూరి అభిమానులకు అభ్యంతరం లేకపోయినా న్యూట్రల్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలంటే ఈ ఒక్క మ్యాజిక్‌ చాలదనే చెప్పాలి. ముఖ్యంగా స్టార్స్‌, ఇతర హంగుల కంటే కంటెంట్‌కి, వైవిధ్యానికే నేటి ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో బాలయ్య-క్రిష్‌లు అంతకు మించిన విషయాలను, ప్రజలకు తెలియని వాస్తవాలను, ఎమోషన్స్‌ని, ఎన్టీఆర్‌ తన కెరీర్‌ ఎదుగుదలలో పడిన శ్రమ వంటి పలు అంశాలను హృద్యంగా చూపందే వీలుకాదు. ‘మహానటి’లో నాటి సావిత్రి సినిమాల రిఫరెన్స్‌లు తక్కువగా ఉండటం, ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న భావోద్వేగాలకు పెద్ద పీట వేయడం వల్లే ఆ మూవీ అందరినీ కట్టిపడేసిందనే వాస్తవాన్ని మనం మర్చిపోలేం. 

కానీ రెండున్నర గంటల చిత్రంలో ఎక్కువ సమయంలో ఎన్టీఆర్‌ పాటలు, రీమిక్స్‌లు, గెటప్‌లకే కేటాయిస్తే అసలు విషయం మరుగున పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఏదో గ్రామాలలో జరిగే రికార్డు డ్యాన్స్‌లు, గెటప్‌ల తరహాలో ఈ చిత్రం మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ ‘మహానాయకుడు’ లో మాత్రం తప్పనిసరిగా ఎన్టీఆర్‌ జీవితాన్ని చూపించే అవకాశం ఉంది. కానీ ఇందులో కూడా సబ్జెక్ట్‌ సీరియస్‌గా సాగుతుందేగానీ ఇతర హంగులకు ఆర్బాటాలకు చాన్స్‌లు తక్కువనే వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ రెండు చిత్రాలకు భారీ అంచనాలు పక్కనపెడితే కఠిన సమస్యలు కూడా ఉన్నాయని అనిపించడం అసహజమేమీ కాదు. మరోవైపు ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ చిత్రానికి మాత్రం బిజినెస్‌పరంగా మంచి ఊపు ఉంది. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం కింద రూ.25కోట్ల భారీ డీల్‌ సెట్‌ అయిందని అంటున్నారు. ఇక శాటిలైట్‌ రైట్స్‌తో కలిపితే చిత్రం బడ్జెట్‌లో 75శాతం పైగా దీని ద్వారానే జమ అవ్వడం ఖాయం. ఇక థియేటికల్‌ రైట్స్‌ ఏ స్థాయిలో పలుకుతాయో దీనిని బట్టి అర్ధమవుతోంది. సంక్రాంతి హీరోగా బాలయ్యకు తిరుగు లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులు లేవు. 

ఇక ఈ చిత్రంలో నటించిన అందరి పాత్రలు బయటకు వచ్చినా బాలయ్య పాత్రను చిత్రంలో ఎవరు చేయనున్నారు? సూపర్‌స్టార్‌ కృష్ణ పాత్ర ఎవరు చేశారు? అనే ఆసక్తిని మాత్రం ఇది బాగానే కలిగిస్తోంది. ఆల్‌రెడీ పలువురు, చివరకు ఫిల్మ్‌ క్రిటిక్‌ కత్తి మహేష్‌ కూడా ఎన్టీఆర్‌ యంగ్‌ పాత్రను, లేదా బాలయ్య పాత్రను యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ చేసి ఉంటే సినిమాకి సంపూర్ణత్వం వచ్చేదని అన్నారు. ఇక కృష్ణ పాత్రలో మహేష్‌ నటించాడనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు బాలయ్య పాత్రను నందమూరి మోక్షజ్ఞ పోషించాడని అందుకే ఈ విషయంలో యూనిట్‌ సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తోందని కూడా అంటున్నారు. ఎందుకంటే ‘మనం’ చిత్రంలో కూడా అఖిల్‌ నటించడం లేదని చెప్పి చివరకు తెరపై మాత్రం అఖిల్‌ని మెరుపు పాత్రగా చూపించారు. మరి ఇలాంటి గిమ్మిక్స్‌ బాలయ్య కూడా ఫాలో అయ్యాడా? లేదా? అనేది తేలాల్సివుంది....! 

NTR Kathanayakudu Movie Plus and Minus Points:

NTR Kathanayakudu Movie latest Update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement