Advertisementt

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చేతులు మారాడా?

Sun 23rd Dec 2018 08:10 AM
bellamkonda srinivas,tiger nageswara rao,tiger nageswara rao biopic,rana,nani,anil sunkara,  టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చేతులు మారాడా?
bellamkonda as tiger nageswara rao టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చేతులు మారాడా?
Advertisement
Ads by CJ

తెలుగులో బ‌యోపిక్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇలాంటి సినిమాల‌కే ఈ మ‌ధ్య జ‌నం బ్రహ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ కూడా బ‌యోపిక్‌ల‌కే జైకొడుతున్నారు. సెట్స్‌పైనున్న బ‌యోపిక్‌లు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా తెలుగులో మ‌రో బ‌యోపిక్ తెర‌పైకి రాబోతోంది. 70వ ద‌శ‌కంలో ఆంధ్రా రాబిన్ హుడ్‌గా పేరున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా ఓ సినిమా రాబోతోందంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో రానా న‌టిస్తాడంటూ ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. 

అ త‌రువాత నాని న‌టిస్తాడ‌నే వార్త‌లు షికారు చేశాయి. అదీ కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ చేతులు మారింద‌నే వార్త షికారు చేస్తోంది. పైగా ఇందులో బెల్లంకొండ సురేష్ బంగారు కొండ శ్రీ‌నివాస్ హీరోగా న‌టించే అవ‌కాశం వుంద‌న్న‌ది తాజా వార్త‌ల సారాంశం. క‌మ‌ర్శియ‌ల్ క‌థానాయ‌కుడిగా ఇంకా నిల‌దొక్కుకోని బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఏకంగా బ‌యోపిక్ లో న‌టించ‌డానికి సిద్ధ‌ప‌డ‌టం ఏంట‌న్న‌దే ఇప్పుడు స‌గ‌టు ప్రేక్ష‌కుడి మ‌దిని తొలుస్తున్న మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌. 70వ ద‌శ‌కం నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి `కిట్టు వున్నాడు జాగ్ర‌త్త` ఫేమ్ వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర నిర్మించే అవ‌కాశం వుంద‌ని తాజా అప్‌డేట్‌.  

bellamkonda as tiger nageswara rao:

srinivas as tiger nageswara rao

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ