మెగా ఈవెంట్: తమ్ముడు కోసం అన్నయ్య!

Mon 17th Dec 2018 01:34 AM
ram charan,varun tej,sankalp reddy,antariksham,chief guest,pre release event  మెగా ఈవెంట్: తమ్ముడు కోసం అన్నయ్య!
Mega Hero Chief Guest for His Brother Film Function మెగా ఈవెంట్: తమ్ముడు కోసం అన్నయ్య!
Sponsored links

రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా డిసెంబ‌ర్ 18న అంత‌రిక్షం 9000 kmph ప్రీ రిలీజ్ వేడుక‌.. 

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దీనికి ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో అంత‌రిక్షం 9000 kmph సినిమాను తెర‌కెక్కించారు సంక‌ల్ప్ రెడ్డి. తాజాగా విడుద‌లైన ఆడియో.. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. వ‌రుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ విఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్, అదితిరావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల 

సాంకేతిక విభాగం: ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి, నిర్మాత‌లు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి, నిర్మాణ సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్,  సినిమాటోగ్ర‌ఫీ: జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్ (బాబా), ఎడిట‌ర్: కార్తిక్ శ్రీ‌నివాస్, 

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్: రామ‌కృష్ణ సబ్బ‌ని, మోనిక నిగొత్రే స‌బ్బ‌ని,  సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్ విహారి, స్టంట్స్: ట‌డోర్ ల‌జ‌రోవ్,  సిజి: రాజీవ్ రాజ‌శేఖ‌రన్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Sponsored links

Mega Hero Chief Guest for His Brother Film Function:

Ram Charan for Varun Tej and Sankalp Reddy’s ‘Antariksham’ Pre-Release Event

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019